Ghani First Song: ఆకట్టుకుంటున్న వరుణ్ తేజ్ ‘గని’ ఆంధమ్..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా ‘గని’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రం ద్వారా కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అల్లు బాబీ – సిద్ధు ముద్ద ఈ నిర్మిస్తున్న ఈ చిత్రం నుండీ ఆల్రెడీ ఫస్ట్ పంచ్ అంటూ ఓ గ్లిమ్ప్స్ ను విడుదల చేయగా దానికి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 3న విడుదల కాబోతుంది.

తాజాగా ఈ చిత్రం నుండీ ‘గని ఆంధమ్’ పేరుతో ఫస్ట్ సింగిల్ ను విడుదల చేశారు. ‘దే కాల్ హిమ్ గని .. కనివిని ఎరుగని’ అంటూ సాగే ఈ పాటకి సంబంధించి నిన్న ప్రోమో విడుదల చేయగా ఈరోజు ఫుల్ సాంగ్ ను విడుదల చేశారు. తమన్ అందించిన ట్యూన్.. రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ ఈ పాటకి హైలెట్ గా నిలిచాయని చెప్పొచ్చు. ఆడియెన్స్ నుండీ ఈ సాంగ్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.

‘తమ్ముడు’ సినిమాలో ‘లుక్ ఎట్ మై ఫేస్’, ‘భద్రాచలం’ లో ఒకటే గమనం వంటి ఇన్స్పిరేషనల్ సాంగ్స్ కు మాదిరి ఈ పాట కూడా ఉందని ప్రేక్షకులు కితాబిస్తున్నారు. ఇక నుండీ జిమ్ లలో ఈ పాట మార్మోగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఈ పాటలో వరుణ్ తేజ్ వర్కౌట్లు చేస్తున్న విధానం కూడా ఆకర్షణీయంగా ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!


సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus