Ghani Trailer: గెలవడం తప్ప వేరే ఆప్షన్ లేదన్న గని!

వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్ హీరోహీరోయిన్లుగా కిరణ్ కొర్రపాటి డైరెక్షన్ లో తెరకెక్కిన గని సినిమా ఫిబ్రవరి 25వ తేదీన రిలీజ్ కావాల్సి ఉన్నా ఆ తేదీకి భీమ్లా నాయక్ ఫిక్స్ కావడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ఏప్రిల్ 8వ తేదీకి మారింది. వరుస విజయాలతో జోరుమీదున్న వరుణ్ తేజ్ గని సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. తాజాగా గని మూవీ ట్రైలర్ విడుదలైంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలను పెంచింది.

Click Here To Watch Now

బాక్సింగ్ నేపథ్యంలో గని మూవీ తెరకెక్కగా లైఫ్ లో బాక్సింగ్ ఆడనని తల్లికి మాటిచ్చిన హీరో అమ్మకు తెలియకుండా బాక్సింగ్ ఆడుతూ నేషనల్ ఛాంపియన్ కావాలని కలలు కంటూ ఉంటాడు. మరోవైపు సాయి మంజ్రేకర్ తో గని ప్రేమలో ఉంటాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా హీరో తన లక్ష్యాన్ని ఎలా సాధించాడనే కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నవీన్ చంద్ర నటించారు. వరుణ్ తేజ్ కు ధీటుగా నవీన్ చంద్ర ట్రైలర్ లో డైలాగ్స్ చెప్పి మెప్పించారు.

“నాకు గెలవడం తప్ప వేరే ఆప్షన్ లేదు” అంటూ వరుణ్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఉపేంద్ర, బ్రహ్మాజీ, జగపతిబాబు ట్రైలర్ లో కొన్ని సెకన్ల పాటు కనిపించారు.. ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండటంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ” లైఫ్ లో మంచోన్ని గెలుకు.. చెడ్డోన్ని గెలుకు.. కానీ నాలా ఆటను గెలిపించాలనుకునే పిచ్చోన్ని మాత్రం గెలక్కు” అంటూ వరుణ్ చెప్పిన డైలాగ్ ట్రైలర్ కు హైలెట్ గా నిలిచింది.

ఈ మధ్య కాలంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకోలేదు. అయితే గని సినిమా ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందించగా ఆర్ఆర్ఆర్ విడుదలైన రెండు వారాల తర్వాత గని థియేటర్లలో విడుదల కానుంది. యూట్యూబ్ లో గని ట్రైలర్ కు రికార్డు స్థాయిలో వ్యూస్, లైక్స్ వస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద గని ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరో మూడు వారాలు ఆగాల్సిందే.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!


ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus