Ghani First Punch: ఫస్ట్ పంచ్ అంటే పంచ్ మాత్రమేనా ??

ఎప్పుడో 2019లో కరోనా కంటే ముందు రిలీజ్ అయిన “వాల్మీకి” అలియాస్ “గద్దలకొండ గణేష్” తర్వాత వరుణ్ తేజ్ మొదలెట్టిన సినిమా “ఘని”. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మొదలైన ఈ చిత్రం ఫస్ట్ లాక్ డౌన్ తర్వాత విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. సీజీ వర్క్ కంప్లీట్ అవ్వకపోవడంతో ఇప్పటివరకూ పుష్ చేస్తూ వచ్చారు. బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీలకపాత్ర పోషిస్తున్నారు.

ఈ చిత్రం టీజర్ ను “ఫస్ట్ పంచ్” అంటూ ఇవాళ విడుదల చేశారు చిత్ర బృందం. వరుణ్ తేజ్ నుంచి దాదాపు రెండేళ్ల తర్వాత వస్తున్న సినిమా టీజర్ కావడంతో కనీసం డైలాగ్ అయినా ఉంటుంది అని ఆశపడ్డారు జనాలు. అయితే.. “ఫస్ట్ పంచ్” అనే పదానికి జస్టీఫికేషన్ చేస్తూ.. వరుణ్ పంచ్ గ్లింప్స్ ను మాత్రమే రిలీజ్ చేశారు. అల్లు బాబీ నిర్మాతగా మారి రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న విడుదల చేయనున్నారు.

సరిగ్గా రెండు నెలల టైమ్ ఉంది కాబట్టి ప్రమోషన్స్ ఈ ఫస్ట్ పంచ్ తో మొదలెట్టారు అనుకోవచ్చు కానీ.. మరీ ఇలా మోషన్ పోస్టర్ లాంటి టీజర్ ను మాత్రం ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. ఇకపోతే.. ఘని చిత్రాన్ని తెలుగుతోపాటు వేరే భాషల్లోనూ రిలీజ్ చేయడానికి దర్శకర్నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అవి ఎంతమేరకు ఫలిస్తాయి అనేది చూడాలి.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!


హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus