Varun Tej: లావణ్య కోసం వాటిని రెడీ చేస్తున్న వరుణ్ తేజ్

ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన భామ లావణ్య త్రిపాఠి… మెగా హీరో వరుణ్ తేజ్ తో ప్రేమలో ఉన్నట్లు.. ఇద్దరూ డేటింగ్ కూడా చేస్తున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరిగింది. అయితే ఎట్టకేలకు ఆ సస్పెన్స్ కు తెరదించే సమయం వచ్చినట్టు టాక్ నడుస్తుంది. జూన్ 9న లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ ల ఎంగేజ్మెంట్ జరగబోతుంది అని అనఫీషియల్ గా క్లారిటీ వచ్చేసింది. చాలా సింపుల్ గా వీరి ఎంగేజ్మెంట్ జరగబోతుంది అనే టాక్ కూడా వినిపిస్తోంది.

ఈ క్రమంలో నాగ బాబు ఇంట్లో నిశ్చితార్ధానికి అవసరమైన పనులు మొదలైనట్టు టాక్ వినిపిస్తుంది. బట్టల షాపింగ్, గోల్డ్ షాపింగ్ వంటి పనులు కంప్లీట్ అయ్యాయట. లావణ్య ఫ్యామిలీ హైదరాబాద్ కు రానుంది అని వినికిడి. ఇదిలా ఉంటే తాజాగా వరుణ్ తేజ్ ఓ పోస్ట్ పెట్టాడు. తాను స్వయంగా గవ్వలు, పిజ్జా వంటివి చేసుకుని తింటున్నట్టు ఆ పోస్ట్ ఉంది. వరుణ్ తేజ్ కు కుకింగ్ అంటే చాలా ఇష్టం. అది తన పెదనాన్న(చిరంజీవి) వద్ద నేర్చుకున్నట్టు వరుణ్ చెబుతుంటాడు.

ఇదిలా ఉంటే కొంచెం రిలాక్స్ అవ్వడానికో, ఏమో కానీ గవ్వలు, పిజ్జా రెడీ చేస్తున్నట్లు ఇలా పోస్ట్ పెట్టాడు. ఇది చూసిన నెటిజన్లు.. ‘అన్నా వదినకు వంట రాదా?, వదిన కోసం నువ్వే వంట నేర్చుకుంటున్నావా? ఇవి వదినకోసమే చేస్తున్నావా?, పెళ్ళికి రెడీ అవుతున్నప్పుడు, అలాగే పెళ్లయ్యాక కొన్ని రోజులు భార్యకి ఇలాగే అన్నీ చేసిపెడుతూ ఉంటారు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో వరుణ్ (Varun Tej) పోస్ట్ వైరల్ గా మారింది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus