ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో సందడి చేసిన వరుణ్ తేజ్ లావణ్య.. ఏమైందంటే?

మెగా హీరో వరుణ్ తేజ్ భిన్నమైన కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది వరుణ్ తేజ్ నటించిన గని, ఎఫ్3 సినిమాలు విడుదల కాగా గని సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంటే ఎఫ్3 మూవీ మాత్రం సూపర్ హిట్ స్టేటస్ ను అందుకుంది. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో వరుణ్ తేజ్ ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

అయితే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి జోడీకి సంబంధించి గతంలో కొన్ని వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కాంబోలో మిస్టర్, అంతరిక్షం సినిమాలు తెరకెక్కగా ఈ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నాయి. ఈ జోడీకి మంచి పేరు వచ్చినా వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో నిర్మాతలు ఈ కాంబినేషన్ పై ఆసక్తి చూపడం లేదు.

మరోవైపు వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని వైరల్ అయిన రూమర్ల గురించి అటు లావణ్య ఇటు వరుణ్ తేజ్ తమ మధ్య ఏం లేదని పరోక్షంగా సోషల్ మీడియా పోస్టుల ద్వారా క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా జరిగిన బర్త్ డే పార్టీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి సందడి చేశారు. బర్త్ డే జరుపుకున్న వ్యక్తి అటు వరుణ్ తేజ్ కు, ఇటు లావణ్య త్రిపాఠికి కామన్ ఫ్రెండ్ అని సమాచారం అందుతోంది.

ఒకేచోట లావణ్య, వరుణ్ కలిసి కనిపించడంతో వీళ్లిద్దరి గురించి వైరల్ అయిన ప్రేమ, పెళ్లి వార్తల గురించి చర్చ జరుగుతోంది. ఈ పుట్టినరోజు వేడుకకు నితిన్, నితిన్ భార్య షాలిని, సాయితేజ్ కూడా హాజరయ్యారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తమ మధ్య ప్రేమ లేదని చెబుతున్నా అభిమానులు మాత్రం నమ్మడం లేదు. వరుణ్ లావణ్య జోడీ రియల్ జోడీ అవుతుందో లేక రీల్ జోడీగానే మిగిలిపోతుందో కాలమే సమాధానం చెప్పాలి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus