వరుణ్ తేజ్ లైనప్ మామూలుగా లేదు.. అదుర్స్ ..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి అనే యువ దర్శకుడితో ‘బాక్సర్’ (వర్కింగ్ టైటిల్) చిత్రం చేస్తున్నాడు. అల్లు బాబీ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కరోనా వైరస్ కారణంగా ఏర్పడ్డ లాక్ డౌన్ వల్ల వాయిదాపడింది. సెప్టెంబర్ నుండీ ఈ చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభం కాబోతుందని టాక్ నడుస్తుంది. కిగ్ బాక్సింగ్ నేపథ్యంలో ఈ చిత్రం కథ ఉండబోతుంది. కాబట్టి యాక్షన్ కు ఎక్కువ స్కోప్ ఉంటుంది అని అంచనా వెయ్యొచ్చు. అయితే ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఈ చిత్రంలో పుష్కలంగా ఉంటాయని టాక్..! ఇప్పటి వరకూ పూర్తయిన షూటింగ్ రషెస్ చూసిన టీం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు సమాచారం.

ఇక ఈ చిత్రం పూర్తయిన తరువాత అనిల్ రావిపూడి డైరెక్షన్లో ‘ఎఫ్2’ సీక్వెల్ అయిన ‘ఎఫ్3’ చెయ్యబోతున్నాడు వరుణ్ తేజ్. ఈ చిత్రం పక్కా కామెడీ మరియు ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో ఉండబోతుందని టాక్ బలంగా వినిపిస్తుంది. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం కావడంతో ఇది కూడా సూపర్ హిట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ‘ఎఫ్3’ పూర్తయ్యాక ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్ చంద్ర డైరెక్షన్లో మరో చిత్రానికి కమిట్ అయ్యాడట వరుణ్. ’14 రీల్స్ ప్లస్’ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్.. ఫస్ట్ టైం పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట.

మరోసారి ఈ చిత్రంలో తెలంగాణ స్లాంగ్లో వరుణ్ మాట్లాడతాడని కూడా టాక్..! గతేడాది ‘ఎఫ్2’ తో బ్లాక్ బస్టర్ అలాగే ‘గద్దలకొండ గణేష్’ తో మాస్ హిట్ అందుకున్న వరుణ్ తేజ్.. ఇప్పుడు వరుసగా 3 డిఫరెంట్ జోనర్లలో సినిమాలు చేస్తున్నాడు. కచ్చితంగా అవి మినిమం గ్యారంటీ సినిమాలే.. అనే టాక్ బలంగా వినిపిస్తుంది. అదే కనుక నిజమైతే వరుణ్ కూడా స్టార్ హీరోల లిస్ట్ లో చేరడం గ్యారెంటీ అనే చెప్పొచ్చు.

Most Recommended Video

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus