రెండోసారి వన్ మిలియన్ డాలర్ సాధించిన వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఫిదా మూవీతో కెరీర్ గేర్ మార్చారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 60 కోట్లు వసూళ్లను సాధించింది. అమెరికాలోను భారీగానే రాబట్టింది. వరుణ్ చిత్రాల్లో ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్లను క్రాస్ చేసిన సినిమాగా ఫిదా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ మూవీ తర్వాత వరుణ్ తేజ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో “తొలి ప్రేమ” సినిమా చేశారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం తొలి రోజు నుంచి మంచి టాక్ సొంతం చేసుకొని హౌస్ ఫుల్ కలక్షన్స్ సాధించింది. నాలుగురోజుల్లో పాతికకోట్ల గ్రాస్ రాబట్టిన ఈ మూవీ ఓవర్సీస్ లోను జోరు కొనసాగించింది.

నిన్న శుక్రవారం నాటికీ తొలిప్రేమ వన్ మిలియన్ డాలర్ల మార్క్ ని అధిగమించింది. ఇలా వరుణ్ కెరీర్ లో రెండోసారి వన్ మిలియన్ డాలర్ మార్క్ ని క్రాస్ చేశారు. ఇలా విదేశాల్లో రెండు సార్లు వన్ మిలియన్ క్రాస్ చేసిన వారిలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, నాని తదితరులు ఉన్నారు. ఆ జాబితాలో వరుణ్ తేజ్ చేరారు. వరుసగా రెండు విజయాలను సొంతం చేసుకున్న వరుణ్ తేజ్.. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ ప్రాజక్ట్ ని మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ‘ఘాజి’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్ష నేపథ్యంలో సినిమా చేయడానికి సిద్దమవుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus