Varun Tej, Lavanya Tripathi: మెగాహీరోతో పెళ్లి పుకార్లు.. లావణ్య క్లారిటీ ఇచ్చిందా..?

టాలీవుడ్ లో ఈరోజు ఒక హాట్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. మెగాహీరో వరుణ్ తేజ్ పాతిక లక్షల విలువైన డైమండ్ రింగ్ తీసుకొని బెంగుళూరు వెళ్లారని.. అక్కడ ఓ హీరోయిన్ కి పెళ్లి ప్రపోజల్ చేయబోతున్నారనేది ఆ వార్త. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే.. లావణ్య త్రిపాఠి.

ఈ ఇద్దరూ కలిసి గతంలో కొన్ని సినిమాల్లో నటించారు. ‘మిస్టర్’, ‘అంతరిక్షం 9000 కెఎంపిహెచ్‌’ సినిమాల్లో ఇద్దరూ నటించారు. ఈ రెండూ ఫ్లాప్ అయ్యాయి. వరుణ్ తేజ్ చెల్లెలి నీహారిక పెళ్లికి లావణ్య వెళ్లిందని.. మెగా ఫ్యామిలీతో బాండ్ పెంచుకుంటుందని అన్నారు. ఇప్పుడేమో ఏకంగా వరుణ్ తేజ్ ఆమెని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయాన్ని వరుణ్-లావణ్య లైట్ తీసుకున్నట్లు ఉన్నారు.

అయితే లావణ్య మాత్రం పరోక్షంగా తను బెంగుళూరులో లేనని చెప్పే ప్రయత్నం చేసిందని అంటున్నారు నెటిజన్లు. కాసేపటి క్రితం తన పెట్ డాగ్ వీడియో, తన ఫొటో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. అందులో డెహ్రాడూన్‌ లొకేషన్ ట్యాగ్ చేసింది. డెహ్రాడూన్‌లో ఓ రోడ్ ఫొటో పోస్ట్ చేసింది. దీనిబట్టి ఆమె డెహ్రాడూన్‌లో ఉందని చెప్పకనే చెప్పింది.

బెంగుళూరులో లేననే విషయాన్ని ఆమె తెలివిగా ఒక్క పోస్ట్ తో చెప్పిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా.. ఈ జంట పెళ్లి చేసుకుంటుందని వస్తోన్న వార్తల్లో నిజం లేదని.. మెగా ఫ్యామిలీకి చెందిన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికైనా ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి!

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus