వైరల్ అవుతున్న వరుణ్ తేజ్ ట్వీట్..

రీసంట్ గా తమ్ముడు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ అంటూ టీజర్ తో రెSచ్చిపోతే, ఇప్పుడు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఆచార్య టీజర్ తో మెగాఫ్యాన్స్ కి కిక్ ఇవ్వబోతున్నాడు. ఫన్నీ మీమ్ తో ట్రోల్ అయినా కూడా జనవరి 29వ తేది సాయంత్రం టీజర్ కి ముహూర్తం పెట్టింది కొరటాల శివ అండ్ టీమ్. ఇక ఈ టీజర్ ఎలా ఉండబోతోంది అనేది మెగాఫ్యాన్స్ తో ఉత్సుకతని రేపుతోంది. అగ్నికి ఆర్జ్యం పోసినట్లుగా దీనికి తోడు వరుణ్ తేజ్ ట్వీట్ ద్వారా ఫ్యాన్స్ ని తెగ ఊరించేస్తున్నాడు.

ఈ టీజర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ తో స్టార్ట్ కాబోతోంది అంటూ హింట్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ చరణ్ ఆచార్య సినిమాలో సిద్ధ క్యారెక్టర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు ఆచార్యని పరిచయం చేస్తూ వాయిస్ తో ఈ టీజర్ స్టార్ట్ కాబోతున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. ఇంకో మేటర్ ఏంటంటే, మాస్ యాక్షన్ బిల్డప్ షాట్స్ తో చిరంజీవి రివీల్ అవుతూ, పవర్ ఫుల్ డైలాగ్ తో టీజర్ ని ఎండ్ చేస్తాడని కూడా టీజర్ విశేషాలని లీక్ చేసేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఇప్పుడు 29వ తేదికంటే ముందే అంటే 28వ తేదినే టీజర్ లీకైపోతుందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అన్నయ్య సినిమా అంటే ఈమాత్రం హైప్ ఉండాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్. అంతేకాదు, ఈ టీజర్ ఎప్పుడొస్తుందా.. దాన్ని ట్రెండ్ చేద్దామా అని కాసుకుని కూర్చున్నారు. అదీ మేటర్.


Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus