Ghani Movie: వరుణ్ అకౌంట్లో మరో హిట్టు గ్యారెంటీ అట..!

  • February 11, 2022 / 07:51 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందిన చిత్రం ‘గని’. అల్లు బాబీ కంపెనీ, రినైసెన్స్ పిక్చర్స్.. బ్యానర్లు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. తమన్ సంగీతంలో రూపొందిన పాటలకి మంచి రెస్పాన్స్ లభించింది.ఇటీవల విడుదలైన ‘రోమియో జూలియట్’ పాటకి కూడా మంచి రెస్పాన్స్ లభించింది.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అతిథి ఈ పాటని పాడడం విశేషంగా చెప్పుకోవాలి.

Click Here To Watch

టీజర్‌ కూడా ప్రేక్షకుల్ని అలరించింది. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ఎన్నో వర్కౌట్లు చేసి బాడీని బిల్డ్ చేసాడు.ఫిబ్రవరి 25న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి.ఈ చిత్రానికి ఎటువంటి కట్స్ లేకుండా యు/ఎ సర్టిఫికెట్ ను జారీ చేసారు సెన్సార్ సభ్యులు. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సినిమా ఔట్పుట్ చాలా బాగా వచ్చిందని చిత్ర బృందం ముందు నుండీ చెబుతూనే వస్తోంది. తాజాగా సెన్సార్ సభ్యులు కూడా అది నిజమేనని స్పష్టం చేసారు. ‘గని’ ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని, సెకండ్ హాఫ్ అయితే యువతకి స్ఫూర్తినిచ్చే విధంగా ఉందని.. ఫ్యామిలీ ఎమోషన్స్ ను కూడా ఈ మూవీలో బాగా మిక్స్ చేసినట్టు వారు చెప్పుకొచ్చారు. దర్శకుడు కిరణ్ కొత్త దర్శకుడు తీసినట్టు కాకుండా ఎంతో అనుభవం కలిగిన దర్శకుడిలా సినిమాని తీర్చిదిద్దినట్టు సెన్సార్ సభ్యులు ప్రశంసించారు. మొత్తానికి వరుణ్ ఖాతాలో మరో హిట్ పడడం ఖాయంగా కనిపిస్తుంది.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus