c పూర్తిగా విభిన్నకథా చిత్రాలు చేస్తుండడంతో వరుణ్ సినిమా పై జనాల్లో అంచనాలు నమోదవుతూ ఉంటాయి. అలా అని వరుణ్ తేజ్ సినిమాలకి భారీ కలెక్షన్లు వచ్చిన సందర్భాలు తక్కువ. ‘ఫిదా’ ‘ఎఫ్2’ చిత్రాలు భారీగా కలెక్ట్ చేసాయి. వాటికి కాంబినేషనల్ క్రేజ్ అనేది ముడిపడి ఉంది. అయితే ‘తొలిప్రేమ’, ‘గద్దలకొండ గణేష్’ వంటి చిత్రాలు రూ.25 కోట్ల షేర్ వరకు నమోదు చేసిన సినిమాలే..!
ఎటు చూసుకున్న అతని సినిమాలకి రూ.35 కోట్ల మార్కెట్ ఉంటుంది. కానీ ‘గని’ అనే చిత్రానికి ఏకంగా రూ.50 కోట్లు పెట్టేసారు నిర్మాతలు.సాయి మంజ్రేకర్, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర, నదియా, జగపతి బాబు.. వంటి పెద్ద క్యాస్టింగ్ ఉండడం… దానికి తోడు కరోనా ఎఫెక్ట్ పడడంతో బడ్జెట్ శృతి మించింది. ‘గని’ కి దర్శకత్వం వహించింది కిరణ్ కొర్రపాటి, ఇతనికి ఇదే మొదటి చిత్రం. వరుణ్ తేజ్ కెరీర్ లో కూడా ఇది హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ.
నిర్మాతలు బాబీ,సిద్దులకి కూడా ఇదే మొదటి చిత్రం. అయితే ఈ ప్రాజెక్టుకి ఉన్న పెద్ద బలం అల్లు అరవింద్ గారు. అందుకేనేమో రిలీజ్ కు ముందే ఈ చిత్రం ఓటిటి, శాటిలైట్ రైట్స్ రూపంలో రూ.25 కోట్లు కలెక్ట్ చేసాయి.ఆ రకంగా కూడా వరుణ్ తేజ్ కెరీర్ ఇదే హయ్యెస్ట్ నాన్ థియేట్రికల్ బిజినెస్. మరి థియేట్రికల్ రైట్స్ రూపంలో ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి..!