‘కేజిఎఫ్’ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో కూడా పాపులర్ అయ్యాడు వశిష్ట సింహా (Vasishta Simha). అటు తర్వాత వెంకటేష్ ‘నారప్ప’ (Narappa) సినిమాలో కూడా నటించాడు. అటు తర్వాత సంపత్ నంది (Sampath Nandi) దర్శకత్వంలో వచ్చిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ (Odela Railway Station) సినిమాలో విలన్ గా చేసి మరింత పాపులర్ అయ్యాడు. అలాగే కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ‘డెవిల్’ (Devil) , చాందిని చౌదరి (Chandini Chowdary) ‘యేవమ్’, ‘సింబా’ (Simbaa) వంటి సినిమాల్లో కూడా కీలక పాత్రలు పోషించాడు. అటు తర్వాత ఇతను టాలీవుడ్ హీరోయిన్ హరిప్రియని (Hariprriya) ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
‘పిల్ల జమిందార్’ (Pilla Zamindar) ‘తకిట తకిట'(Thakita Thakita) ‘జైసింహా’ (Jai Simha) వంటి సినిమాలతో ఆమె బాగా పాపులర్ అయ్యింది. కన్నడలో కూడా ఈమె హీరోయిన్ గా రాణించింది. ఇదిలా ఉండగా.. వసిష్ఠ సింహా, హీరోయిన్ హరిప్రియ తమ పెళ్లిరోజు నాడే పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఇటీవల హరిప్రియ బేబీ బంప్ ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమెకు డెలివరీ కూడా అయినట్టు స్పష్టమవుతుంది. సోషల్ మీడియా ద్వారా ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది.
‘మా పెళ్లిరోజు నాడే ప్రిన్స్ వచ్చాడు’ అంటూ సింహాల ఫోటో షేర్ చేసింది. దీంతో ఆ పోస్ట్ వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఈమె ఫాలోవర్స్ కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. బెంగళూరులోని ఓ హాస్పిటల్లో హరిప్రియ డెలివరీ అయినట్లు తెలుస్తుంది. తల్లి,బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నారట. 2023 జనవరి 26న సింహ (Vasishta Simha), హరిప్రియ..ల పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే.