సినిమాకి పబ్లిసిటీ చేసుకోవడంలో ప్రపంచం మొత్తం మీద రాజమౌళిని (S. S. Rajamouli) మించినోడు లేడు. ఇది ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. సినిమాకి అనౌన్స్మెంట్ జరగకపోతే బిజినెస్ జరగడం కష్టం అని అంతా భావించే ఈరోజుల్లో.. ఇంకా అనౌన్స్మెంట్ ఇవ్వకుండానే ‘ఎస్.ఎస్.ఎం.బి 29’ కోసం ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేశాడు రాజమౌళి. ఈ మధ్యనే పూజా కార్యక్రమాలు జరిగాయి. కానీ ఒక్క ఫోటో బయటకు వదల్లేదు. అయినా సోషల్ మీడియా షేక్ అయ్యింది. ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హైదరాబాద్ వచ్చింది.
Priyanka Chopra
ఈ సినిమాలో ఆమె హీరోయిన్ గా ఎంపికైంది అనే ప్రచారం జరుగుతుంది. మహేష్ బాబు Mahesh Babu) ఫ్యాన్స్ దీని గురించి తెగ చర్చించుకుంటున్నారు. వాస్తవానికి మహేష్ పక్కన ప్రియాంక హీరోయిన్ గా చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. లుక్స్ వైజ్ ప్రియాంక చోప్రా మహేష్ కంటే పెద్దగా కనిపిస్తుంది. పెయిర్ చూడముచ్చటగా ఉండదు.మరోపక్క ప్రియాంక చోప్రా మెయిన్ హీరోయిన్ కాదు అనే వార్తలు కూడా వస్తున్నాయి. మహేష్ ఫ్యాన్స్ ఎంత బాధపడుతున్నా.. ఈ విషయం పై రాజమౌళి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.
కానీ వాళ్ళని ఆ టాపిక్ నుండి డైవర్ట్ చేశాడు. పాస్ పోర్ట్ తీసేసుకుని సింహాన్ని బంధించినట్టు ఓ వీడియో వదిలాడు. ‘కాప్చ్యూర్డ్’ అనే కామెంట్ తప్ప ఎటువంటి క్యాప్షన్ లేకుండా ఆ వీడియో పోస్ట్ చేశాడు రాజమౌళి. అంతే సోషల్ మీడియా షేక్ అయిపోయాడు. ఒక 3,4 ఏళ్ళు వెకేషన్స్ కి వెళ్లడం కుదరదు అని మహేష్ బాబుకి అతని ఫ్యాన్స్ కి సింబాలిక్ గా చెప్పడం అనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవాలి.
దీనికి కూడా ప్రియాంక చోప్రా ‘ఫైనల్లీ’ అంటూ ఎక్సయిట్మెంట్ ఫీల్ అవుతూ క్యాప్షన్ పెట్టింది. అయినా సరే మహేష్ ఫ్యాన్స్ ప్రియాంకని పట్టించుకోకుండా డైవర్ట్ అయ్యారు. తర్వాత తీరిగ్గా ప్రియాంక చోప్రా ఒరిజినల్ హీరోయిన్ కాదు.. అని రాజమౌళి రివీల్ చేసుకోవచ్చు. ‘పాన్ వరల్డ్ స్కెచ్చులు’ అంటే ఇవే అనాలి.