రవితేజ ప్రస్తుతం భాను భోగవరపు దర్శకత్వంలో ‘మాస్ జాతర’ అనే సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈరోజు అనగా జనవరి 26న రవితేజ పుట్టినరోజు కావడంతో మాస్ జాతర నుండి చిన్న గ్లింప్స్ వదిలారు. మాస్ జాతర గ్లింప్స్ విషయానికి వస్తే ఇది 1:02 నిమిషాల నిడివి కలిగి ఉంది.
Mass Jathara
ఇందులో కథకి సంబంధించిన ఎటువంటి హింట్ ఇవ్వలేదు. రవితేజ క్యాజువల్ గా అద్దం ముందు నిలబడి హెయిర్ దువ్వుకుంటూ ఫోజులు ఇచ్చాడు. ‘ నా ఆటోగ్రాఫ్’ సినిమాలో ‘దువ్విన తలనే దువ్వడం’ అనే పాటను గుర్తుచేస్తూ ఈ విజువల్ ఉంది. తర్వాత రవితేజ రౌడీలను తన స్టైల్లో కొట్టడం చూపించారు. పోలీస్ డ్రెస్ లో రవితేజ లుక్ బాగుంది. అతని ఏజ్ ఒక పదేళ్లు తగ్గిన ఫీలింగ్ కలుగుతుంది. హీరోయిన్ దగ్గర ‘మనదే ఇదంతా’ అంటూ చెప్పే డైలాగ్ ‘ఇడియట్’ రోజులను గుర్తుచేస్తుంది.
ఇక అద్దంలో చేసుకుని రవితేజ తనని తాను తిట్టుకుంటున్న విజువల్ అయితే ‘వెంకీ’ ని గుర్తుచేస్తుంది. మొత్తంగా ‘మాస్ జాతర’ గ్లింప్స్ రవితేజ మంచి నోస్టాలజిక్ ఫీల్ ను కలిగిస్తుంది అని చెప్పాలి. కాకపోతే రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది మాత్రం ఈ గ్లింప్స్ తో చెప్పలేదు. బహుశా సమ్మర్ లో ఉంటుంది అనుకోవాలి. ఇక మీరు కూడా గ్లింప్స్ ను ఒకసారి చూడండి: