బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కిన వీరసింహారెడ్డి గతేడాది జనవరి నెల 12వ తేదీన థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఫుల్ రన్ లో ఈ సినిమాకు 75 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు వచ్చాయి. కర్నూలు జిల్లాలోని ఆలూరులో ఉన్న ఎస్.ఎల్.ఎన్.ఎస్ థియేటర్ లో ఈ సినిమా 365 రోజులు ఆడటం గమనార్హం. రోజుకు నాలుగు ఆటలతో అక్కడ ఈ సినిమా 365 రోజుల పాటు ప్రదర్శింపబడింది.
రాయలసీమలో బాలయ్యకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. బాలయ్య సినిమాలకు హిట్ టాక్ వస్తే ఈ ఏరియాలో సరికొత్త రికార్డులు సొంతమవుతాయి. బాలయ్య గతేడాది భగవంత్ కేసరి సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నారు. వాల్తేరు వీరయ్య మూవీ ఒక థియేటర్ లో 365 రోజుల పాటు ప్రదర్శించబడగా (Veera Simha Reddy) వీరసింహారెడ్డి మూవీ కూడా 365 ఆడిందని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
బాలయ్య ఈ ఏడాది బాబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సమ్మర్ కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. సితార నిర్మాతలు నిర్మిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేయనుందో చూడాలి. 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. త్వరలో ఈ సినిమా నుంచి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయని తెలుస్తోంది.
బాలయ్య ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నారు. బాలయ్య ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో సైతం ఒక సినిమా తెరకెక్కనుండగా ఆ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాల్సి ఉంది. సినిమాల ప్లానింగ్ విషయంలో బాలయ్యకు ఎవరూ సాటిరారని కామెంట్లు వినిపిస్తున్నాయి. వరుస విజయాలు సాధించే దిశగా స్టార్ హీరో బాలయ్య అడుగులు పడుతున్నాయి.
గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!
హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!