Venkatesh: వెంకటేష్ 75వ సినిమాకు డైరెక్టర్ ఆయనేనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోలలో వెంకటేష్ ముందువరసలో ఉంటారు. ఈ ఏడాది వెంకటేష్ హీరోగా నటించిన మూడు సినిమాలు విడుదల కానున్నాయి. మే నెల 14వ తేదీన అసురన్ రీమేక్ గా తెరకెక్కుతున్న నారప్ప విడుదల కావాల్సి ఉండగా జూన్ 20వ తేదీన దృశ్యం 2, ఆగష్టు 27వ తేదీన ఎఫ్3 సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ మూడు సినిమాలలో నారప్ప, ఎఫ్3 థియేటర్లలో రిలీజ్ కానుండగా దృశ్యం 2 ఓటీటీలో రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతోంది.

వరుసగా సినిమాలను రిలీజ్ చేస్తూ వెంకటేష్ సీనియర్ హీరోలతో పాటు కుర్ర హీరోలకు సైతం షాక్ ఇస్తున్నారు. వెంకటేష్ ప్రస్తుతం నటిస్తున్న మూడు సినిమాలతో 74 సినిమాలు పూర్తి కానుండగా వెంకటేష్ 75వ సినిమాకు సంబంధించిన ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతోంది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేష్ 75వ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని వైరల్ అవుతున్న వార్త సారాంశం. వెంకటేష్ సినీ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్లైన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ మాటల రచయితగా పని చేసిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ వెంకటేష్ కాంబినేషన్ లో ఒక సినిమా పట్టాలెక్కనుందని రెండేళ్ల క్రితం వార్తలు వచ్చాయి.

వెంకటేష్ 75వ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తారో లేక మరో డైరెక్టర్ దర్శకత్వం వహిస్తారో చూడాల్సి ఉంది. మహేష్ సినిమా తరువాత త్రివిక్రమ్ వెంకటేష్ సినిమాకు డైరెక్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రతి హీరో కెరీర్ లో 25, 50, 75, 100వ సినిమాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వెంకటేష్ తన 75వ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తారో చూడాల్సి ఉంది. వెంకీ త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి వార్తలు వస్తుండటంతో సినిమాల విషయంలో , డైరెక్టర్ల విషయంలో వెంకటేష్ ప్లానింగ్ మామూలుగా లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus