విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఎఫ్ 3. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఈ నెల 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలో పాల్గొన్న చిత్రబృందం పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మీడియాతో ముచ్చటించిన వెంకటేష్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియ చేశారు.
వెంకటేష్ మాట్లాడుతూ.. నేను సెట్లోకి అడుగు పెట్టగానే నిర్మాత పక్షాన ఆలోచిస్తాను. సెట్ లో ఏది వృధా అయినా ఏమాత్రం సహించని, ఫిలిం మేకింగ్ ప్లానింగ్ కి ఒక ఫార్ములా ఉండదు ఫైనల్ గా రిజల్ట్ బాగుంటేనే అప్పటి వరకు మనం పడిన శ్రమ మొత్తం మర్చిపోతామని తెలిపారు. ఇక ఈ సమావేశంలో భాగంగా రియాలిటీ షోల గురించి కూడా వెంకటేష్ మాట్లాడారు. ఇప్పటికీ తనను రియాలిటీ షోలో పాల్గొనమని చాలామంది సంప్రదించారు.
అయితే రియాలిటీ షోలలో చెప్పిన డైలాగ్ పదేపదే చెబుతూ, ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఇవ్వమంటే రెండు మూడు సార్లు తర్వాత ఏదో తెలియని బ్లాక్ వచ్చేస్తుంది.అందుకే రియాలిటీ షోలలో చేయడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ కారణం చేతే తాను రియాలిటీ షోలు చెయ్యని వెంకటేష్ వెల్లడించారు. పాన్ ఇండియా సినిమాలు గురించి మాట్లాడుతూ.. సరైన టీం దొరికితే తప్పకుండా తాను కూడా పాన్ ఇండియా సినిమాలో నటిస్తానని వెంకటేష్ ఈ సందర్భంగా తెలియజేశారు.
ఇకపోతే ఆయన వారసుడిగా తన కొడుకు సినీ ఎంట్రీ గురించి పలు ప్రశ్నలు ఎదురు కాగా ప్రస్తుతం తన కొడుకు తన దృష్టిని పూర్తిగా చదువు పై ఉంచారని, ప్రస్తుతానికైతే ఏ విధమైనటువంటి ఆలోచనలు లేవని వెంకటేష్ ఈ సందర్భంగా తన కొడుకు సినీ ఎంట్రీ గురించి తెలియజేశారు.