2026 సంక్రాంతికి 5 స్ట్రైట్ తెలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ప్రభాస్ ‘ది రాజాసాబ్’, చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’. ఒక్క ‘రాజాసాబ్’ మినహా మిగిలిన 4 సినిమాలు ఫ్యామిలీస్, కామెడీని టార్గెట్ చేసి తీసినవే. ఇదిలా ఉంటే.. ఆ మిగిలిన 4 సినిమాల్లో 2 సినిమాలకు సేమ్ ఫార్ములా అప్లై చేస్తున్నారు.
ఆ 2 సినిమాలు మరెవరో కాదు ఒకటి ‘మన శంకర వరప్రసాద్ గారు’ .. ఇంకోటి ‘నారీ నారీ నడుమ మురారి’. ఈ 2 సినిమాలు కూడా కంప్లీట్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసి తీసినవే.మరో సిమిలారిటీ ఏంటంటే.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాల్లో మరో హీరోలు కేమియోలు ఇస్తుండటం. అవును ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో వెంకటేష్(Venkatesh) కేమియో ఇస్తున్నాడు.’నారీ నారీ నడుమ మురారి’ లో శ్రీవిష్ణు కేమియో ఉంది.
వాస్తవానికి వెంకటేష్ కంటే చిరుకి క్రేజ్ ఎక్కువ. కానీ చిరు ఇప్పుడు కొంచెం డౌన్లో ఉన్నారు. అందుకే దర్శకుడు అనిల్ రావిపూడి తన గత సినిమా హీరో వెంకటేష్ ని రంగంలోకి దింపుతున్నాడు. వెంకటేష్ కేమియో వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ మరింత ఎంగేజ్ అయ్యి సినిమాని హిట్ చేస్తారు అనేది అనిల్ ప్లాన్. మరోవైపు ‘నారీ నారీ నడుమ మురారి’ టీం కూడా సేమ్ ఫార్ములా అప్లై చేస్తుంది. శ్రీవిష్ణు కంటే శర్వానంద్ మార్కెట్ పరంగా పెద్ద హీరో.
అయినప్పటికీ ఇప్పుడు అతను ఫామ్లో లేడు. అందుకే దర్శకుడు రామ్ అబ్బరాజు తన గత సినిమా హీరో అయిన శ్రీవిష్ణుని రంగంలోకి దింపుతున్నాడు. శ్రీవిష్ణు ఎంట్రీ వల్ల యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎంగేజ్ అయ్యి శర్వానంద్ కి హిట్ ఇస్తారు అనేది రామ్ అబ్బరాజు నమ్మకం కావచ్చు.ఇక్కడ ఇంకో విశేషం కమ్ విచిత్రం ఏంటంటే.. శ్రీవిష్ణు మన వెంకటేష్ బాబుకి వీరాభిమాని. తన అభిమాన హీరోలానే ఈ సంక్రాంతికి కేమియోతో సందడి చేయబోతున్నాడు. అది మేటర్..!
