2025(2025 Tollywood) లో పెద్ద సినిమాలు ఎక్కువ రిలీజ్ కాలేదు. రిలీజ్ అయిన పెద్ద సినిమాలు కూడా అనేక ఆటంకాలు దాటుకుంటూ వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద కూడా అవి ఆశించిన రేంజ్లో పెర్ఫార్మ్ చేయలేదు. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. గత ఏడాది వచ్చిన సినిమాల్లో హైయెస్ట్ గ్రాసర్స్ గా నిలిచిన సినిమాలు ఏంటో.. టాప్ 10 లిస్టులో ఏమున్నాయో ఓ లుక్కేద్దాం రండి :

1) ఓజి : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి 2025 లో ‘హరిహర వీరమల్లు’ రూపంలో పెద్ద దెబ్బ పడింది. అయితే 2 నెలల గ్యాప్ లో వచ్చిన ‘ఓజి’ పర్వాలేదు అనిపించింది. సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సీన్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా బాగా పెర్ఫార్మ్ చేసింది. కానీ ఆశించిన స్థాయిలో కాదు. మొత్తంగా ఈ సినిమా రూ.288 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో అలాగే 2025 లో హైయెస్ట్ గ్రాసర్ ఇదే.

2)సంక్రాంతికి వస్తున్నాం : ‘సైందవ్’ తో పెద్ద డిజాస్టర్ ఫేస్ చేసిన విక్టరీ వెంకటేష్ 2025 లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.269 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. వెంకటేష్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ ఇదే. అలాగే సంక్రాంతి విన్నర్ గా కూడా నిలిచింది.

3)గేమ్ ఛేంజర్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ పాన్ ఇండియా సినిమా ‘గేమ్ ఛేంజర్’. 2025 సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి షోకే ప్లాప్ టాక్ మూటగట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.188 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ ఏడాది పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో టాప్ 3 లో స్థానం దక్కించుకుంది.

4)మిరాయ్ : తేజ సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ‘మిరాయ్’ అనే మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ వచ్చింది. ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. టికెట్ రేట్లు అవి తక్కువగా ఉండటం, సినిమాలో విజువల్స్ కూడా రిచ్ గా ఉండటంతో .. ఆడియన్స్ ఈ సినిమాని థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆసక్తి చూపించారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.138 కోట్ల వరకు గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

5)డాకు మహారాజ్ : నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో ‘డాకు మహారాజ్’ అనే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ వచ్చింది. 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ ఫ్యామిలీ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో పోటీ పడలేక రేసులో వెనుకబడింది. మొత్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.125 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

6)అఖండ 2 : నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో రూపొందిన 4వ సినిమా ‘అఖండ 2’. 2025 డిసెంబర్ 4న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడి డిసెంబర్ 12న రిలీజ్ అయ్యింది. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.115 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

7)కుబేర : ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం యాక్షన్ డ్రామా మూవీ ‘కుబేర’. అక్కినేని నాగార్జున, రష్మిక మందన కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. జూన్ లో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. మొత్తంగా ఈ సినిమా రూ.116 కోట్లు గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

8)హిట్ 3 : ‘హిట్’ యూనివర్స్ లో భాగంగా ‘హిట్ 3′(హిట్ : ది థర్డ్ కేస్) వచ్చింది. నాని ఈ సినిమాలో హీరోగా నటించాడు. 2025 సమ్మర్ లో రిలీజ్ అయ్యింది. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫుల్ రన్లో రూ.112 కోట్లు గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

9)హరిహర వీరమల్లు : పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ అనే సినిమా వచ్చింది. మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. పవన్ కళ్యాణ్ క్రేజ్ కారణంగా ఓపెనింగ్ వీకెండ్ వరకు నిలబడింది. మొత్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.108 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

10)కింగ్డమ్ : విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘కింగ్డమ్’ సినిమా రూపొందింది. మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేదు. కానీ మిక్స్డ్ టాక్ తో కూడా బాక్సాఫీస్ వద్ద రూ.78 కోట్లు గ్రాస్ వసూళ్లు రాబట్టింది.
