Venkatesh: రానా నాయుడు వెబ్ సిరీస్ పై వెంకటేశ్ స్పందన ఇదే!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన వెంకటేశ్ (Venkatesh) ఈ మధ్య కాలంలో ఏ ప్రాజెక్ట్ లో నటించినా ఆ సినిమా సక్సెస్ సాధిస్తూ వెంకటేశ్ సక్సెస్ రేట్ ను పెంచుతుంది. వరుస విజయాలతో వెంకటేశ్ యంగ్ జనరేషన్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు. అయితే రానా నాయుడు వెబ్ సిరీస్ లో వెంకీ రోల్ గురించి నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. వెంకటేశ్ ఇమేజ్ కు డ్యామేజ్ చేసేలా ఈ వెబ్ సిరీస్ ఉందని కామెంట్లు వ్యక్తమయ్యాయి.

ఈ వెబ్ సిరీస్ గురించి వెంకటేశ్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో తానెప్పుడూ ఈ తరహా పాత్రలో నటించలేదని తెలిపారు. పర్సనల్ గా ఇది నాకు కొత్త అని ఆయన పేర్కొన్నారు. నేను ఫ్యామిలీ హీరోగా మాత్రమే అందరికీ తెలుసని వెంకటేశ్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు మాత్రం టర్న్ తీసుకున్నానని ఆయన కామెంట్లు చేశారు.

డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఈ రోల్ నేను చేయగలనని నమ్మినందుకు సంతోషిస్తున్నానని వెంకీ తెలిపారు. నేను నా బెస్ట్ ఇచ్చానని ఆయన అన్నారు. రానా మాట్లాడుతూ బాబాయ్ తో కలిసి వెబ్ సిరీస్ లో నటించడం సంతోషాన్ని కలిగించిందని అన్నారు. అందరికీ గుర్తుండిపోయేలా విభిన్నంగా చేయాలని అనుకున్నామని రానా చెప్పుకొచ్చారు. రానా నాయుడు విభిన్నమైన ఫ్యామిలీ డ్రామా అని రానా తెలిపారు.

అయితే వెంకటేశ్ ఇకపై ఇలాంటి ప్రాజెక్ట్ లకు దూరంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వెంకటేశ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 12 కోట్ల రూపాయలుగా ఉంది. వెంకటేశ్ ప్రస్తుతం సైంధవ్ అనే ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకుడు అనే సంగతి తెలిసిందే. సినిమా సినిమాకు వెంకటేశ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. వెంకీ కొత్త ప్రాజెక్ట్ లు సైతం భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus