30 రోజుల్లోనే పూర్తి చేస్తాడట!

రీమేక్ సినిమాల్లో నటించడంలో టాలీవుడ్ లో వెంకీదే పై చేయి. ఆయన చేసినన్ని రీమేకులు ఇప్పటివరకూ ఏ ఇతర కథానాయకుడూ చేయలేదు. తాజాగా ఆయన నటించనున్న రీమేక్ చిత్రం “సాలా ఖద్దూస్”. హిందీలో మాధవన్ ముఖ్యపాత్ర పోషించడంతోపాటు నిర్మించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
ఈ సినిమాను తెలుగులో హిందీ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన సుధ కొంగర తెరకెక్కించనుంది. సురేష్ ప్రొడక్షన్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ ను కేవలం 30 రోజుల్లో పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట చిత్ర బృందం!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus