Venkatesh: స్టార్ హీరో వెంకటేశ్ ఫేవరెట్ హీరో ఎవరో మీకు తెలుసా?

స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఉన్న హీరోలలో ఒకరనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం వెంకటేశ్ సైంధవ్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో వెంకీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే వెంకటేశ్ ఫేవరెట్ హీరో ఎవరనే ప్రశ్నకు సమాధానం చాలామందికి తెలియదు.

అలనాటి స్టార్ హీరోలలో ఒకరైన శోభన్ బాబు వెంకటేశ్ ఫేవరెట్ హీరో కావడం గమనార్హం. వెంకటేశ్ శోభన్ బాబుతో ఒక సినిమాను కూడా నిర్మించారు. ఎంకి నాయుడు బావ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కగా వెంకటేశ్ ఎంటర్టర్ప్రైజెస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించారు. 1978 సంవత్సరం డిసెంబర్ చివరి వారంలో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాను నిర్మించే సమయానికి వెంకటేశ్ సినిమాల్లోకి రాలేదు.

ఆ తర్వాత రోజుల్లో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన వెంకటేశ్ కలియుగ పాండవులు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే సక్సెస్ ను సొంతం చేసుకున్న వెంకటేశ్ ఆ తర్వాత రోజుల్లో కెరీర్ పరంగా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. రీమేక్ సినిమాలలో ఎక్కువగా నటించిన వెంకటేశ్ కు మెజారిటీ సందర్భాల్లో షాకింగ్ ఫలితాలు ఎదురయ్యాయి. నారప్ప, దృశ్యం2, ఎఫ్3 సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న వెంకటేశ్

కెరీర్ విషయంలో ఏ తప్పు జరగకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. వెంకటేశ్ ఒక్కో సినిమాకు 15 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి సైతం వెంకటేశ్ ఓకే చెబుతున్నారు. వెంకీ తర్వాత ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus