Venkatesh: ‘ఆడవాళ్లు మీకు జోహర్లు’ అందుకే వదులుకున్నాడా?

ఒక హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో చేయడం… మనం చాలాసార్లు చూశాం. భవిష్యత్తులో చూస్తాం కూడా. అయితే అలా వద్దనుకోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అలా వదిలేసిన సినిమా మంచి విజయం ఇవ్వొచ్చు. ఇంకొకరు వదిలేసిన సినిమా చేసి చేతులు కాల్చుకోనూ వచ్చు. అయితే వదిలేసిన సినిమా ఇంకొకరు చేసిన తర్వాత తొలుత అనుకున్న హీరోకు ఆ కథ ఏ మాత్రం నప్పదు అని తెలిస్తే… తొలి హీరో ఫ్యాన్స్‌కి చాలా హ్యాపీ. ఇప్పుడు అలాంటి ఫేజ్‌లోనే ఉన్నారు వెంకటేశ్‌ ఫ్యాన్స్‌. కారణం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమా.

శర్వానంద్‌ – కిషోర్‌ తిరుమల కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. రష్మిక మందన కథానాయికగా నటించింది. ఈ సినిమాకు బాక్సాఫీసు దగ్గర ఫర్వాలేదనిపించే టాక్‌ వస్తోంది. సినిమా ఫైనల్‌ ఫలితం ఈ రోజుల తేలిపోతుంది అంటున్నారు ట్రేడ్‌ పరిశీలకులు. అయితే ఈ సినిమాను వెంకటేశ్‌ చేసి ఉంటే మాత్రం ఇబ్బంది కలిగేదే అని మాత్రం తేల్చేస్తున్నారు. కారణం ఆ సినిమాలో హీరో పాత్ర వెంకీకి అంతగా సూట్‌ అయ్యే పరిస్థితి లేకపోవడమే.

‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమా చూస్తే… అందులో హీరో ఏ పెళ్లి చూపులకు వెళ్లినా రిజక్ట్‌ అవుతూనే ఉంటుంది. పెళ్లి కోసం అత్తను కాకా పట్టే సన్నివేశాలు ఉంటాయి. ఇలాంటి సీన్స్‌ వెంకటేశ్‌ చేసి ఉంటే అంతగా బాగోదు అని ఫ్యాన్స్‌, నెటిజన్లు అనుకుంటున్నారు. ఆ సినిమా చూశాక… ఈ కథను వెంకటేశ్‌తో ఓకే చేయించుకోవాలని కిషోర్‌ తిరుమల ఎలా అనుకున్నారు అంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వెంకీ ఈ సినిమాకు ఓకే చెప్పకపోవడం సరైన పని అని కూడా అనుకుంటున్నారు.

‘మల్లీశ్వరి’ సినిమాలో వెంకటేశ్‌ సుమారుగా ఇలాంటి పాత్రే చేశారు. ఈ కారణంగానే ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమా కథ విని ఓకే చేయలేదేమో అనే చర్చ కూడా నడుస్తోంది. అయితే సినిమా టైటిల్‌ మాత్రమే ఇదని, హీరో మారాక కథను మార్చానని గతంలో కిషోర్‌ తిరుమల చెప్పడం గమనార్హం.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus