Narappa Movie: ఫ్యాన్స్ కు తీపికబురు చెప్పిన వెంకీ?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, ప్రియమణి కాంబినేషన్ లో శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తెరకెక్కిన నారప్ప మూవీ ఓటీటీలో రిలీజ్ కానుందని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 24వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో నారప్ప రిలీజ్ కానుందని ప్రచారం జరగగా అమెజాన్ ప్రైమ్ మాత్రం ఈ సినిమాను ఈ నెల 20వ తేదీనే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఏపీ, తెలంగాణలో థియేటర్లను తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినా చిత్రబృందం ఓటీటీ వైపు మొగ్గు చూపింది.

అసురన్ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. సురేష్ బాబుతో పాటు కలిపులి ఎస్ థాను ఈ సినిమాను నిర్మించగా మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన నారప్ప ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం వెంకటేష్ తన లుక్ ను పూర్తిగా మార్చుకోవడం గమనార్హం. వెంకటేష్ ఓటీటీలో నారప్పను రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ కు తీపికబురు అందించారు.

ఎఫ్ 2, వెంకీ మామ సినిమాల తర్వాత వెంకటేష్ నటించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాల్సి ఉంది. అమెజాన్ ప్రైమ్ ఈ మూవీ హక్కులను భారీ మొత్తం ఖర్చు చేసి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. నారప్ప ఓటీటీలో రిలీజవుతున్న నేపథ్యంలో థియేటర్లలో కూడా ఈ సినిమాను రిలీజ్ చేస్తారో చూడాల్సి ఉంది.


Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus