రానా బాబుకి చెక్ పెట్టబోతున్న వెంకటేష్..!

విక్టరీ వెంకటేష్ నారప్ప రూట్ మారుస్తున్నాడా.. అంటే నిజమే అంటున్నారు సినీజనం. ఇంతకీ మేటర్ ఏంటంటే, నారప్ప రిలీజ్ డేట్ ని మార్చే పనిలో ఉందట మూవీ టీమ్. ఈ సినిమాని ప్రీ పోన్ చేసి అనుకున్న టైమ్ కంటే ముందే రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ముందుగా మే నెల 14వ తేదిన ఈ సినిమాని రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు. వెంకటేష్ తో ఉన్న పోస్టర్ ని సైతం రిలీజ్ చేసి రిలీజ్ డేట్ ని లాక్ చేశారు.

అయితే, ఒక్కరోజు ముందు మెగాస్టార్ ఆచార్య సినిమా ఉండటం అనేది ఇప్పుడు నారప్ప రూట్ మార్చేలా చేసింది. మే 13వ తేదిన మెగాస్టార్ ఆచార్యగా థియేటర్స్ లో సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. సమ్మర్ లో వస్తున్న మెగా ప్రాజెక్ట్ ఇదే కావడంతో విక్టరీ వెంకటేష్ ఇప్పుడు సైడ్ ఇచ్చేశాడని అంటున్నారు. అయితే, ఈసినిమా ఏప్రిల్ 30వ తేదినకి మార్చబోతున్నట్లుగా సమాచారం. ఈ డేట్ కి ఆల్రెడీ రానా విరాటపర్వం సినిమా రిలీజ్ ని ఎనౌన్స్ చేశారు.

దీంతో రానాబాబుకి చెక్ పెట్టేందుకు నారప్ప రాబోతున్నాడా అని కూడా అంటున్నారు. దీనికి సురేష్ బాబు అండ్ టీమ్ తో మాట్లాడారని విరాటపర్వం టీమ్ వాళ్ల సినిమాని వాయిదా వేసుకోవడానికి అంగీకారం తెలిపారని కూడా చెప్తున్నారు. రానా విరాటపర్వం మే నెలలో మంచి డేట్ చూస్కుని లాక్ చేస్కోబోతున్నారట. మొత్తానికి వెంకటేష్ వెళ్లి రానా సినిమాకి ఎసరు పెట్టినట్లుగానే ఉంది వ్యవహారం అంటూ సినీ పండితులు పెదవి విరుస్తున్నారు. అదీ మేటర్.

Most Recommended Video

చెక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అక్షర సినిమా రివ్యూ & రేటింగ్!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus