టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, అనీల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన ‘ఎఫ్ 2’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా ‘ఎఫ్ 3’ రాబోతుంది. ఈ సినిమా కోసం దిల్ రాజు భారీ రెమ్యునరేషన్లు ఇస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. నిజానికి ‘ఎఫ్ 2’ సమయంలో వెంకీకి రూ.6 కోట్లు, వరుణ్ కు రూ.3 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చిన దిల్ రాజు ఇపుడు మాత్రం భారీగానే ముట్టజెప్పుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ టాప్ హీరోతో ముచ్చటించిన దిల్ రాజు ‘ఎఫ్ 3’ రెమ్యునరేషన్ల గురించి మాట్లాడారట.
ఆ వివరాల ప్రకారం కేవలం రెమ్యునరేషన్లకే రూ.50 కోట్లు ఖర్చు అవుతుందని తెలుస్తోంది. హీరో వెంకటేష్ కి రూ.12 కోట్లు, వరుణ్ తేజ్ కి రూ.8 కోట్లు, తమన్నాకి రెండు కోట్లు, మెహ్రీన్ కి రూ.70 లక్షలు, కమెడియన్ సునీల్ కి రూ.75 లక్షలు, దేవిశ్రీప్రసాద్ కి రూ.3 కోట్లు, దర్శకుడు అనీల్ రావిపూడికి రూ.12 కోట్లు రెమ్యునరేషన్లు ఫిక్స్ చేశారట. వీరితో పాటు వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డి ఇలా చాలా మంది పేరున్న నటులను తీసుకుంటున్నారు. నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్ మొత్తం కలిపి రూ.50 కోట్లు దాటేస్తుందని అంచనా వేస్తున్నారు.
సినిమాను 60 నుండి 70 రోజుల పాటు చిత్రీకరించాల్సి ఉంటుంది. కాబట్టి షూటింగ్ ఖర్చు, వడ్డీలు, పబ్లిసిటీ ఖర్చు అన్నీ కలుపుకొని రూ.30 కోట్ల వరకు ఖర్చవుతుందని సమాచారం. ఇలా చూసుకుంటే సినిమా బడ్జెట్ రూ.70 నుండి 80 కోట్ల వరకు అయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారీ బడ్జెట్ తో సినిమా చేస్తే కలెక్షన్లు ఎంతవరకు వస్తాయో చూడాలి!