నారప్ప షూటింగ్ కి కూడా బ్రేక్ ఇచ్చారు, ఇక టాలీవుడ్ మొత్తం సైలెంట్

ప్రపంచదేశాలను తీవ్రస్థాయిలో వణికిస్తున్న కరోనా ప్రభావం ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాలకూ పాకుతోంది. దీని తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో ఏమేరకు ఉంది అనేది తెలియడానికి ఇంకాస్త సమయం పట్టోచ్చు. కానీ.. ఈ ఎఫెక్ట్ అన్నీ భాషల చిత్రపరిశ్రమల మీద ఏస్థాయిలో ఉంది అనేది ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ కరోనా సెగ వెంకీ & టీంకూ తగిలింది. తమిళ సూపర్ హిట్ చిత్రం “అసురన్”ను తెలుగులో “నారప్ప”గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేయాలనుకున్నారు. అందుకే అనంతపూర్ జిల్లాలోని పాల్తూరు గ్రామంలో ఒక భారీ ఖాళీ స్థలాన్ని లీజుకు తీసుకొని మరీ రెగ్యులర్ షూట్ చేయడం మొదలెట్టారు.

అయితే.. ఇప్పుడు కరోనా ప్రపంచాన్ని కబలిస్తున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని షూటింగ్ ను వాయిదా వేయడమే కాక ప్రొడక్షన్ పనులు కూడా ప్రస్తుతానికి ఆపేస్తున్నట్లు సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ప్రకటించింది. ఆల్రెడీ చిరంజీవి, ప్రభాస్ లు తమ షూటింగ్ లు ఆపేసుకోగా, మహేష్, అల్లు అర్జున్ లు షూటింగ్ కూడా మొదలెట్టలేదు. అందరు ఇంట్లో ఫ్యామిలీ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఆ లిస్ట్ లో ఇప్పుడు వెంకీ కూడా జాయినయ్యాడు. మరి ఈ కరోనా ఎఫెక్ట్ ఎప్పటికీ తగ్గుతుంది, ఇండస్ట్రీ మళ్ళీ ఎప్పటికీ గాడిలో పడుతుంది అనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus