Venky Atluri: త్రివిక్రమ్ గారి సలహాతోనే సెకండ్ హాఫ్ లో ఆ సీన్ పెట్టాను: వెంకీ అట్లూరి

  • February 23, 2023 / 09:56 PM IST

ఇటీవల రిలీజ్ అయిన ధనుష్ బైలింగ్యువల్ మూవీ ‘సార్’ మంచి సక్సెస్ అందుకుంది.తమిళ, తెలుగు భాషల్లో ఫిబ్రవరి 17న రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాని వెంకీ అట్లూరి డైరెక్ట్ చేశాడు. నిజానికి అతను డైరెక్ట్ చేశాడు అంటే నమ్మడం చాలా కష్టం. ఎందుకంటే ఇతను డైరెక్ట్ చేసిన గత మూడు సినిమాలు ప్రేమ కథలే. ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్..

హీరో వెనుక పడటం, సెకండ్ హాఫ్ అంతా హీరో హీరోయిన్ వెనుక పడటం.. అంతేకాకుండా సెకండ్ హాఫ్ అంతా విదేశాల్లో ఉండటం మనం చూశాం. కానీ ‘సార్’ సినిమాకి అతను కంప్లీట్ గా పాటర్న్ మార్చేశాడు. ఇక ‘సార్’ చిత్రాన్ని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ పై నాగవంశీ నిర్మించాడు. ఇది త్రివిక్రమ్ కు హోమ్ బ్యానర్ లాంటిది అన్న సంగతి అందరికీ తెలిసిందే. ‘ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్’ బ్యానర్ తో త్రివిక్రమ్ తన భార్య పేరుతో ఈ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరించారు.

అయితే ‘సార్’ సినిమాలో చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ‘పెద్ద హీరో కాబట్టి ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో త్రివిక్రమ్ ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా?’ అనే ప్రశ్న ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు వెంకీ అట్లూరికి ఎదురైంది. దీనికి అతను సమాధానం ఇస్తూ.. ” ఈ సినిమా కథ విషయంలో కానీ స్క్రిప్ట్ విషయంలో కానీ త్రివిక్రమ్ గారు వేలు పెట్టలేదు. కానీ ఫాదర్ రోల్ మాత్రం కొంచెం పెంచమని చెప్పారు.

సెకండ్ హాఫ్ లో తండ్రీ కొడుకుల మధ్య ఓ సీన్ ఉంటుంది. ఆ టైంలో హీరో ఫాదర్ ‘అడిగింది కొనివ్వకపోతే పిల్లలు ఆ ఒక్క రోజే ఏడుస్తారు .. కానీ తల్లిదండ్రులు కొనివ్వలేని పరిస్థితి ఉన్నంత కాలం ఏడుస్తూనే ఉంటారు’ అంటూ ఎమోషనల్ గా చెబుతాడు. నిజానికి ఇది త్రివిక్రమ్ గారి లైఫ్ లో జరిగింది. ఆయన తండ్రికి ఇంజనీరింగ్ చదివించే స్తోమత లేక చదివించలేకపోయారని బాధపడేవారట’ అంటూ వెంకీ అట్లూరి చెప్పుకొచ్చాడు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus