Venky Kudumula: నితిన్‌ సినిమాపై నెటిజన్‌కు మాటిచ్చిన వెంకీ కుడుముల.. గుర్తుంచుకో అంటూ..!

VNRట్రయో.. అంటూ సినిమా అనౌన్స్‌మెంట్‌తోనే బజ్‌ను అమాంతం పెంచేశారు. ‘భీష్మ’ సినిమా టీమ్‌ రిపీట్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించి కథ, కథనం లాంటి వివరాలు చెప్పలేదు కానీ.. సినిమా మీద అంచనాలు అయితే గట్టిగా ఉన్నాయి. అయితే తాజాగా దర్శకుడు వెంకీ కుడుముల చేసిన ఓ ట్వీట్‌ ఇప్పుడు ఆ అంచనాలను ఇంకా పెంచుతోంది. ఓ నెటిజన్‌ ట్విటర్‌లో వేసిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానంలో ఈ విషయం తెలిసింది.

సినిమా అనౌన్స్‌మెంట్‌తోనే తమ మీద తాము సెటైర్లు వేసుకున్న (Venky Kudumula) వెంకీ కుడుముల, నితిన్‌, రష్మిక మందన. నెక్స్ట్‌ సినిమా చేయడానికి చేయడానికి మూడేళ్లు తీసుకున్నాడు అంటూ కౌంటర్‌ వేసుకున్నాడు. అలాగే తన మీదొస్తున్న పుకార్లు, కాంట్రవర్శీల గురించి రష్మిక మందన సెటైర్లు వేసుకుంది. ఇక నితిన్‌ అయితే ఇంకాస్త డోస్‌ పెంచుతూ తన కెరీర్‌ మీదే కౌంటర్లు, పంచ్‌లు వేసుకున్నాడు. ఇవన్నీ చెప్పారు కానీ సినిమా పాయింట్‌ ఏంటి అనేది చెప్పలేదు.

ఈ సినిమాపై ఓ నెటిజన్‌ ట్విటర్‌లో ‘‘అన్నా నితిన్‌ అన్న సినిమా వేరే లెవల్‌లో ఉండాలి. మాట ఇచ్చావ్‌, గుర్తు పెట్టుకో కొంచెం’’ అంటూ రాసుకొచ్చాడు. దానికి స్పందనగా వెంకీ కుడుముల ‘‘డౌట్‌ అక్కర్లేదు. సినిమా వేరే లెవల్‌లో ఉంటుంది. ఈ మెసేజ్‌ నువ్వు కూడా గుర్తుపెట్టుకో బ్రదర్‌’’ అని రాశారు. దీంతో ఈ ట్వీట్లు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఇక రూమర్స్‌ ప్రకారం ఈ సినిమా కథ ఎలా ఉంటుందంటే..

ప్రాణాంతకమైన వ్యాధితో చావుకి దగ్గరగా ఉన్న ఓ వ్యక్తి కథ ఈ సినిమా అని చెబుతున్నారు. అయితే చెప్పినంత సీరియస్‌గా ఈ సినిమా ఉండదు అంటున్నారు. మరో నెలలో చనిపోతాను అని తెలుసుకున్న ఆ వ్యక్తి ఎలా ఫీల్ అయ్యాడు?, తన జర్నీని హ్యాపీగా ఎలా మార్చుకున్నాడు?, ఈ క్రమంలో సింపతీ చూసి ఎలా ఇరిటేట్ అయ్యాడు ? అనే కోణాల్లో ఈ కథ ఉంటుంది అంట. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని కామెడీగానే చూపిస్తారట.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus