Chiranjeevi: ఫ్యాన్‌తో చిరంజీవి సినిమాపై ఆస్తక్తికర రూమ్స్‌!

చిరంజీవి లైనప్‌ గురించి మీకు తెలిసే ఉంటుంది. రీఎంట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో లేటెస్ట్‌గా అనౌన్స్‌ చేసిన సినిమా వెంకీ కుడుమలది. ఫ్యాన్‌తో మెగాస్టార్‌ సినిమా తీస్తే ఇలా ఉంటుంది అంటూ… సినిమాను ఘనంగా అనౌన్స్‌ చేశారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది. దాని ప్రకారం చూసుకుంటే… ఫ్యాన్స్‌కి ఈ సినిమా ఫుల్‌ మాస్‌ మసాలా ఎంటర్‌టైనర్‌ అని చెప్పొచ్చు.

ఇంకా సులభంగా రెండు ముక్కల్లో చెప్పాలంటే ‘ముఠామేస్త్రీ’ సినిమాలో ఉండొచ్చు అనుకోండి. అదిరిపోయింది కదా న్యూస్‌. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు కానీ… టాక్‌ మాత్రం బలంగా వినిపిస్తోంది. ‘ముఠామేస్త్రీ’ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుందని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇప్పటికే కథ లైన్‌ను చిరంజీవికి వెంకీ కుడుముల వినిపించారట. ఆయన ఓకే చెప్పడంతో కథను పూర్తి స్థాయిలో తీర్చిదిద్దే పనిలో ఉన్నారట వెంకీ.

త్వరలోనే సినిమా ఓపెనింగ్‌ ఉంటుందనే ప్రచారమూ సాగుతుంది. కరోనా పరిస్థితులు సద్దుమణిగాక సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ పెట్టుకుంటారని సమాచారం. ప్రస్తుతం చిరంజీవి చేతిలో ఐదు సినిమాలున్నాయి. తనయుడు రామ్‌చరణ్‌తో కలసి నటించి ‘ఆచార్య’ విడుదలకు సిద్ధంగా ఉంది. దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను అంతా సిద్ధం చేశాడు. ఇటీవల ప్రకటించిన దాని ప్రకారం ఏప్రిల్‌ 1న సినిమాను విడుదల చేస్తారు. ఇది కాకుండా మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం ‘లూసిఫర్‌’ రీమేక్‌ ‘గాడ్‌ఫాదర్’ చిత్రీకరణ చివరి దశకొచ్చింది.

మోహన్‌రాజా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తమిళ హిట్‌ సినిమా ‘వేదాళం’ను ‘భోళా శంకర్‌’ పేరుతో తెరకెక్కిస్తున్నారు మెహర్‌ రమేశ్‌. కీర్తి సురేశ్‌ ఈ సినిమాలో చిరంజీవి సోదరిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ సాగుతోంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్‌ – బాబీ కాంబో ఓ సినిమా రూపొందుతోంది. చిరంజీవి 154వ సినిమా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ అనే పేరు అనుకుంటున్నట్లు సమాచారం.ఈ సినిమా పూర్తి స్థాయి మాస్‌ సినిమాగా ఉంటుందని సమాచారం. విశాఖపట్నం పోర్టు నేపథ్యంలో సినిమా ఉంటుందని ప్రచార చిత్రాల బట్టి అర్థమవుతుంది. ఆ సినిమా తర్వాత వెంకీ కుడుముల సినిమా ఉంఉటుంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!
చిరు పనైపోయిందన్నారు.. ప్లాప్ అన్నారు.. ‘హిట్లర్’ గురించి ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus