Venky Re-release: వెంకీ మూవీ రీ రిలీజ్ కు ఇది సరైన టైమ్ కాదా.. ఏం జరిగిందంటే?

రవితేజ శ్రీనువైట్ల కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సినిమాలలో వెంకీ సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని కామెడీ సీన్స్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. రవితేజ అభిమానులలో చాలామంది ఈ సినిమాను రీరిలీజ్ చేయాలని కోరిన ఫ్యాన్స్ లో ఉన్నారు. అభిమానులు కోరుకున్న విధంగా ఇప్పటికే ఈ సినిమా రీరిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన వెలువడింది. ఈ నెల 30వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

అయితే ఈ సినిమా రీరిలీజ్ డేట్ సరైన డేట్ కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో సలార్ హవా కొనసాగుతోంది. ఈ నెల 29వ తేదీన డెవిల్, బబుల్ గమ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. మరోవైపు టాలీవుడ్ సినీ ప్రేక్షకులు సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ఆ సినిమాలలో రవితేజ ఈగిల్ కూడా ఉంది.

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 30న వెంకీ సినిమాను రీరిలీజ్ చేసినా ఈ మూవీకి ఎక్కువ సంఖ్యలో థియేటర్లు దొరికే పరిస్థితులు అయితే లేవు. వెంకీ రీరిలీజ్ ట్రైలర్ తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో చాలామంది హీరోల రీరిలీజ్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి సరైన రెస్పాన్స్ రావడం లేదు. వెంకీ రీరిలీజ్ కు ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేస్తుండటం గమనార్హం.

రవితేజ సినిమాలు రెండు వారాల గ్యాప్ లో విడుదలైతే రవితేజ ఫ్యాన్స్ ఈగిల్ కు ఇచ్చిన స్థాయి ప్రాధాన్యత వెంకీకి ఇచ్చే ఛాన్స్ అయితే లేదు. వెంకీ రీరిలీజ్ కు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. ఈ సినిమాకు ఎన్ని థియేటర్లు కేటాయిస్తారో చూడాల్సి ఉంది. బాక్సాఫీస్ వద్ద సలార్ హవా కొనసాగుతున్న నేపథ్యంలో (Venky) వెంకీ ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాల్సి ఉంది.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus