త్రివిక్రమ్ డైరెక్షన్లో చేయబోయే చిత్రం పై క్లారిటీ ఇచ్చిన వెంకటేష్..!

సంక్రాంతికి ‘ఎఫ్2’ చిత్రంతో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు విక్టరీ వెంకటేష్. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వరుణ్ తేజ్ తో వెంకటేష్ తో కలిసినటించిన ఈ క్రేజీ మల్టీస్టారర్ చిత్రం జనవరి 9 న విడుదల కాబోతుంది. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో తమన్నా , మెహ్రీన్ లు హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ‘ఎఫ్2’ చిత్ర ప్రమోషన్ల లో భాగంగా వెంకటేష్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాల్ని తెలిపాడు. ‘వెంకీ మామ’ చిత్రం ఎందుకు ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు అనే ప్రశ్నకు వెంకటేష్ బదులిస్తూ… “చైతూతో నేను చేయనున్న ‘వెంకీ మామ’ సినిమా కొన్ని కారణాల వలన ఆలస్యమైంది. కామెడీని కలుపుకుని ఎమోషనల్ గా ఈ చిత్ర కథ నడుస్తుంది. ఈ మధ్య కాలంలో నాకు బాగా నచ్చిన స్క్రిప్ట్ ఇది. నేను .. చైతూ ఇద్దరం కూడా సినిమా మొత్తం కనిపిస్తూనే ఉంటాం. నేను నెక్స్ట్ చేయబోయే సినిమా ఇదే… అందులో ఏ మార్పు లేదు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో నేను చేయబోతున్న మూవీ ఆగిపోయిందనే ప్రచారం జరుగుతోంది…

ఇందులో ఎంతమాత్రం నిజం లేదు అయితే త్రివిక్రమ్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం దసరా కానుకగా విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవితో కూడా త్రివిక్రమ్ ఓ చిత్రం చేయబోతున్నట్టు ‘వినయ విధేయ రామా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్వయంగా చిరునే అనౌన్స్ చేసారు. ఇలాంటి పరిస్థితుల్లో వెంకీ తో త్రివిక్రమ్ చిత్రం ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో మరి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus