Venu Madhav, Pushpa: ఐదేళ్ల క్రితమే వేణు మాధవ్ అలా అన్నారా?

సాధారణంగా నెగిటివ్ టాక్ వచ్చిన భారీ బడ్జెట్ సినిమాలు ఫుల్ రన్ లో నిర్మాతలకు నష్టాలను మిగిల్చే అవకాశాలు ఉంటాయి. అయితే అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ విషయంలో మాత్రం భిన్నంగా జరిగింది. నెగిటివ్ టాక్ తో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. బాలీవుడ్ లో బన్నీ పుష్ప సినిమాకు ప్రమోషన్స్ నిర్వహించకపోయినా అక్కడ ఈ సినిమా 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలతో మాత్రమే బాలీవుడ్ లో సక్సెస్ కావచ్చని భావిస్తున్న టాలీవుడ్ హీరోల ఆలోచన తప్పని బన్నీ ప్రూవ్ చేశారు. హిందీలో ఏడో వారంలో కూడా పుష్ప ది రైజ్ కు పరవాలేదనిపించే స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. పుష్ప ది రూల్ పై భారీ అంచనాలు నెలకొనగా బాలీవుడ్ లో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయని బోగట్టా. పుష్ప ది రూల్ తో కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకుంటామని ఈ సినిమా నిర్మాతలు కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

ఈ సినిమాలో బన్నీ ఇదీ నా కాలే ఇది కూడా నా కాలే నా కాలుమీద నేను కాలు వేసుకుంటే తప్పేంటంటూ యాటిట్యూడ్ ను చూపించే తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సుకుమార్ తన సోదరుడి నుంచి ఈ సన్నివేశాన్ని ఇన్స్పైర్ అయ్యానని వెల్లడించారు. అయితే ఐదు సంవత్సరాల క్రితం వేణుమాధవ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక స్టార్ హీరో తనను కాలుపై కాలు ఎందుకు వేసుకుంటావని అడిగారని చెప్పుకొచ్చారు.

ఆ సమయంలో వేణుమాధవ్ పక్కోడి కాలుపై నేను కాలు వేస్తే తప్పవుతుందని నా కాలు మీద నేను వేసుకుంటే ఎలా తప్పవుతుందని ప్రశ్నించినట్టు తెలిపారు. వేణు మాధవ్ చెప్పిన సమాధానం విని అవాక్కవడం ఆ స్టార్ హీరో వంతైంది. వేణుమాధవ్ చెప్పిన విషయం సుకుమార్ కు తెలుసో తెలియదో చెప్పలేం కానీ కొంతమంది మాత్రం వేణుమాధవ్ రియల్ సీన్ పుష్ప సినిమాలో రీల్ సీన్ అయిందని కామెంట్లు చేస్తున్నారు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!


అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus