సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నుండి వచ్చిన లేటెస్ట్ మూవీ ‘వేట్టయన్- ది హంటర్’ (Vettaiyan) దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదలై పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంది. టి.జె.జ్ఞానవేల్ (T. J. Gnanavel) డైరెక్ట్ చేసిన ఈ చిత్రం రెండో వారంలోకి అడుగుపెట్టింది. రెండో వారం కూడా ఈ సినిమాకి ఎక్కువ థియేటర్లే దక్కాయి. తమిళంలో పర్వాలేదు అనిపించే ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ వేట్టయన్’ తెలుగులో బ్రేక్ ఈవెన్ కోసం ఇంకాస్త కష్టపడాల్సి ఉంది.
ఒకసారి (Vettaiyan) 9 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 3.78 cr |
సీడెడ్ | 1.51 cr |
ఉత్తరాంధ్ర | 1.06 cr |
ఈస్ట్ | 0.49 cr |
వెస్ట్ | 0.39 cr |
గుంటూరు | 0.51 cr |
కృష్ణా | 0.68 cr |
నెల్లూరు | 0.33 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 8.75 cr |
‘వేట్టయన్’ కి రూ.10.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 9 రోజుల్లో ఈ సినిమా కేవలం రూ.8.75 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కి మరో రూ.2.25 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండో వీకెండ్ ను కి గట్టిగా క్యాష్ చేసుకుంటే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకునే ఛాన్స్ ఉంది.