Katrina Kaif: కత్రినా కైఫ్ పనికి షూటింగ్ కౌన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది : విక్కీ కౌశల్

విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమా ఇండ్రస్టీ లో క్యూట్ కపుల్ లిస్ట్ తీస్తే కచ్చితంగా ఈ కపుల్స్ ఉంటారు. ఈ అందమైన జంట ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.2021లో కరోనా మహమ్మారి సమయంలో అతికొద్దిమంది సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది.ఇకపోతే ప్రస్తుతం వీరిద్దరు ఎవరికివారు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.

అలాగే పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ భారీగా సంపాదిస్తున్నారు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్. అలా కెరిర్ పరంగా ప్రస్తుతం ఎవరికి వారు బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇది ఇలా ఉంటే విక్కీ కౌశల్ తాజాగా నటించిన చిత్రం సామ్ బహదూర్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా విక్కీ కౌశల్ మాట్లాడుతూ కత్రినా కైఫ్ ఆ విషయంలో నన్ను బెదిరించిందని చెప్పుకొచ్చారు.

పెళ్లి అయిన రెండు రోజులకే షూటింగ్లో పాల్గొనాలని మూవీ మేకర్స్ కాల్ చేయడంతో వెళ్లడానికి సిద్ధమయ్యాను. కానీ వెంటనే రియాక్ట్ అయిన కత్రినా అలా అయితే వెడ్డింగ్ క్యాన్సిల్ చేసుకుందాము అంటూ నన్ను బెదిరించింది అని తెలిపాడు విక్కీ కౌశల్. ఆ సమయంలో కత్రినా మాటలకు భయపడిపోయిన నేను ఐదు రోజుల తర్వాత షూటింగ్ లో రీ జాయిన్ అయ్యాను అని నవ్వుతూ చెప్పుకొచ్చాడు. అనంతరం ఇంట్లో (Katrina Kaif) కత్రినాతో స్క్రిప్ట్ గురించి డిస్కషన్ చేస్తారా అని యాంకర్ ప్రశ్నించగా.

అసలు అలా జరగదు అని తెలిపాడు. ఒకే ప్రొఫెక్షన్ కు చెందిన ఇద్దరం ఈ విషయాల గురించి షేర్ చేసుకోవచ్చు కానీ అలా చర్చ జరగకపోవడమే ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పుకొచ్చారు విక్కీ కౌశల్. ఇకపోతే కత్రినా కైఫ్ విషయానికి వస్తే ఇటీవలే టైగర్ 3 సినిమాతో ప్రేక్షకులను పలకరించింది కత్రినా కైఫ్. ఈ సినిమాతో మరో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం విజయ్ సేతుపతితో కలిసి ‘మెర్రీ క్రిస్మస్’ అనే హారర్ మూవీ చేస్తుంది. ఈ మూవీ హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతుంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus