Venkatesh: వెంకటేష్ బర్త్ డే స్పెషల్ : ఆ విషయంలో వెంకటేష్ ని కొట్టేవారే లేరు!
- December 13, 2024 / 09:16 PM ISTByFilmy Focus
మూవీ మొఘల్, లెజెండరీ నిర్మాత అయినటువంటి దివంగత డా.డి.రామానాయుడు (D. Ramanaidu) గారి చిన్నబ్బాయిగా ‘ప్రేమ్ నగర్’ తో బాలనటుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టారు వెంకటేష్ దగ్గుబాటి (Venkatesh Daggubati). అభిమానులు ముద్దుగా ఈయన్ని వెంకీమామ అని పిలుచుకుంటూ ఉంటారు. ఈరోజు వెంకటేష్ గారి పుట్టినరోజు.1960 డిసెంబర్ 13న జన్మించారు వెంకటేష్. అందుకే సోషల్ మీడియాలో వెంకటేష్ బర్త్ డే ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతుంది. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకున్న వెంకటేష్ కి.. సినిమాల్లోకి అవ్వాలనే ఆలోచన మొదట లేదు. కానీ కృష్ణ గారు ‘సురేష్ ప్రొడక్షన్స్’ లో చేయాల్సిన ‘కలియుగ పాండవులు’ ప్రాజెక్టు నుండి తప్పుకోవాల్సి వస్తే..
Venkatesh

ఆయన సూచన మేరకే వెంకటేష్ ని (Venkatesh) హీరోగా చేశారు రామానాయుడు. ఈ ఒక్క సినిమా చేసి నటనకి గుడ్ బై చెప్పేయాలనే ఆలోచన కూడా వెంకటేష్ లో ఉంది. కానీ ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం, వెంకటేష్ నటనకి ప్రశంసలు దక్కడం వల్ల.. అతన్ని వెతుక్కుంటూ మంచి మంచి ఆఫర్లు వచ్చాయి. అలా అని తొందరపడకుండా చూసిగా కథలు ఎంచుకుని వరుస విజయాలు అందుకుని ‘విక్టరీ’ ని తన ఇంటిపేరుగా మార్చేసుకున్నారు వెంకటేష్.

వెంకటేష్ తన కెరీర్లో అన్ని రకాల పాత్రలు చేశారు. క్లాస్, మాస్ అనే తేడా లేదు. అన్ని వర్గాల ప్రేక్షకులతో శభాష్ అనిపించుకున్నారు. అయితే ఆయన నటనలో ఆడియన్స్ కి బాగా నచ్చేది.. ఆయన కామెడీ టైమింగ్. స్టార్ కమెడియన్స్ తో పోటీపడి మరీ కామెడీ పండించగల సమర్ధుడు విక్టరీ వెంకటేష్. సినీ పరిశ్రమలో దిగ్గజ దర్శకులు ఒక మాట చెబుతూ ఉంటారు. ‘కామెడీ చేసేవాడు ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలడు’ అని..!

దానికి నిలువెత్తు నిదర్శనంగా వెంకటేష్ పేరు చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే.. కామెడీ చేసేప్పుడు స్టార్స్ కొన్ని లిమిట్స్ పెట్టుకుంటారు. వాళ్లకి ఇగోలు వంటివి కూడా అడ్డొస్తూ ఉంటాయి. కానీ వెంకటేష్.. కామెడీ విషయంలో అలాంటి పరిమితులు ఏమీ పెట్టుకోలేదు. అవసరమైతే తనపై తానే సెటైర్లు వేసుకుని మరీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంటారు. అలాగే వెంకీ ఎంతలా నవ్విస్తారో..

అంతకు మించి ఏడిపించగలరు కూడా..! ‘ప్రేమ’ ‘పవిత్రబంధం’ ‘పెళ్లిచేసుకుందాం’ (Pelli Chesukundam) ‘చంటి’ ‘ఆడవారి మాటలకి అర్దాలే వేరులే’ (Aadavari Matalaku Arthale Verule) ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu) వంటి సినిమాల్లోని వెంకటేష్ ఎమోషనల్ సీన్స్ కి కన్నీళ్లు పెట్టుకోని వాళ్లంటూ ఉండరేమో అనడంలో అతిశయోక్తి లేదు. కామెడీ, ఎమోషన్.. పండించడంలో వెంకటేష్ ని మించిన నటులు లేరు అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు.












