Vidudala Collections: మంచి సినిమాని డిజాస్టర్ చేశారు..!

టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్… తన ‘గీతా డిస్ట్రిబ్యూషన్ సంస్థ’ పై పక్క భాషల్లో రూపొందిన సినిమాలను తెలుగులో డబ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన రిలీజ్ చేస్తున్నారు అంటే ఆ సినిమాలో మంచి కంటెంట్ ఉంటుంది అని అంతా నమ్ముతారు. ‘కాంతార’ సినిమా పాన్ ఇండియా వైడ్ సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో రిలీజ్ చేసింది ఆయనే అన్న సంగతి తెలిసిందే. అదే విధంగా వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన ‘విడుదలై -1’ చిత్రాన్ని తెలుగులో ‘విడుదల -1’ పేరుతో రిలీజ్ చేశారు.

భాషతో సంబంధం లేకుండా దర్శకుడు వెట్రిమారన్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. అదే నమ్మకంతో ‘విడుదల-1’ ని అల్లు అరవింద్.. తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమా చూస్తే చలించని వ్యక్తి ఉండడు అంటే అతిశయోక్తి ఉండదు. అంత నేచురల్ గా ‘విడుదల-1’ ని వెట్రిమారన్ తీర్చిదిద్దాడు. అట‌వీ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రం కథలో… గిరిజ‌నుల‌పై పోలీసుల జులూంని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు.

పోలీసులు గిరిజన మహిళల పై చేసే దాడి చాలా ఘోరంగా అనిపిస్తుంది.వాళ్ళను బట్టలు లేకుండా నిలబెట్టి కొట్టడం, చంపడం వంటి సన్నివేశాలు చూస్తే.. అప్పట్లో నిజంగానే అలా జరిగుండొచ్చేమో.. అనిపించేలా మనల్ని ఆ వరల్డ్ కి తీసుకుపోయాడు వెట్రిమారన్. అయితే ముందుగా అనుకున్నట్టే ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు అని చెప్పాలి. ‘విడుదల-1’ రూ.1.5 కోట్ల షేర్ ను రాబడితే బ్రేక్ ఈవెన్ అయినట్టు.

కానీ ఫుల్ రన్లో (Vidudala) ఈ చిత్రం రూ.0.81 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. దీంతో ఈ మూవీని డిజాస్టర్ గానే పరిగణించాలి. మరి మొదటి పార్ట్ కు ఇలాంటి రిజల్ట్ రావడంతో.. రెండో పార్ట్ ను తెలుగులో రిలీజ్ చేస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెట్రిమారన్ క్రేజ్ ఓటీటీలకు మాత్రమే పరిమితమేమో..!

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus