విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఈ ఏడాది ‘మహారాజ’ తో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుని ఫామ్లోకి వచ్చాడు. ఆ తర్వాత ఇతను నటించిన సినిమా ‘విడుదల 2’ (Vidudala Part 2). మొదటి భాగంలో సూరి (Soori) హీరోగా నటించిన సంగతి తెలిసిందే. వెట్రిమారన్ (Vetrimaaran) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి కొనసాగింపుగా రెండో భాగం వచ్చింది. మొదటి రోజు సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. సాగదీత ఎక్కువగా ఉండటం వల్ల.. మొదటి భాగం స్థాయిలో ఇది లేదని ప్రేక్షకులు పెదవి విరిచారు.
Vidudala Part 2 Collections:
దీంతో ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
‘విడుదల 2’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.3.0 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వీకెండ్ ఈ సినిమా రూ.0.39 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా రూ.3.11 కోట్ల షేర్ ను రాబట్టాలి. ‘పుష్ప 2’ (Pushpa 2 The Rule) ‘ముఫాసా’ వంటి సినిమాలు పోటీగా ఉండటం వల్ల ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు అని స్పష్టమవుతుంది. వీక్ డేస్లో గట్టిగా క్యాష్ చేసుకుంటే తప్ప ఈ ఓపెనింగ్స్ తో బ్రేక్ ఈవెన్ అవ్వడం అనేది కష్టమే అని చెప్పాలి.