అల్లరి నరేష్ (Allari Naresh) నుండి వచ్చిన లేటెస్ట్ మూవీ ‘బచ్చల మల్లి”(Bachhala Malli). డిసెంబర్ 20న రిలీజ్ అయిన ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. ‘సోలో బ్రతుకే సో బెటర్’ (Solo Brathuke So Better) ఫేమ్ సుబ్బు (Subbu Mangadevi) ఈ చిత్రానికి దర్శకుడు. ‘హాస్య మూవీస్’ బ్యానర్ పై రాజేష్ దండ (Rajesh Danda) నిర్మించారు. రిలీజ్ కి ముందు ఈ సినిమాకి బజ్ ఏర్పడింది. బిజినెస్ కూడా బాగా జరిగింది. కానీ రిలీజ్ తర్వాత ఆ బజ్ ఏమాత్రం కలిసి రాలేదు అనే చెప్పాలి. ఓపెనింగ్స్ పరంగా మొదటి రోజు ఓకే అనిపించగా రెండో, మూడో రోజు ఆశించిన స్థాయిలో కలెక్ట్ చేయలేకపోయింది.
‘ బచ్చల మల్లి’ సినిమాకు రూ.5.35 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.6 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వీకెండ్ ఈ సినిమా రూ.1.08 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.4.92 కోట్ల షేర్ ను రాబట్టాలి.