టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు టాప్ హీరోయిన్ గా శ్రీదేవి కొనసాగింది. తన నటనతో కోట్లాది మంది మనసుల్లో స్థానం సంపాదించుకుంది. తెలుగు వారందరూ అతిలోక సుందరిగా పిలుచుకునే ఈమె కొన్ని రోజుల క్రితం లోకం విడిచి వెళ్లారు. దీంతో ఆమె బయోపిక్ తీయాలని చాలామంది ఆశపడ్డారు. కానీ శ్రేదేవి లాంటి అందమైన, ప్రతిభగల నటి ఇప్పుడు లేరని, అందుకే శ్రీదేవి గురించి బయోపిక్ తీయడం అసాద్యమని రామ్ గోపాల్ వర్మ సంచలన కామెంట్స్ చేశారు. బయోపిక్ తీయడంలో దిట్ట అయిన వర్మ ఆలా చెప్పడంతో శ్రీదేవి భర్త బోనీ కపూర్ బయోపిక్ మాట పక్కనెట్టి డాక్యుమెంటరీని నిర్మించేందుకు సిద్ధమయ్యారు.
తాజాగా హిందీ దర్శకుడు హన్సల్ మెహ్తా శ్రీదేవి జీవిత చరిత్రను సినిమాగా రూపొందించడానికి రెడీ అవుతున్నారు. “శ్రీదేవి జీవితంలో ఆర్థిక సమస్యలు, వైద్యుల శస్త్ర చికిత్స తప్పిదంతో తల్లి మరణం, ఆ ఆస్పత్రి నిర్వాకంపై కోర్టు కేసు వేయడం, దుబాయిలో మరణం” వరకూ శ్రీదేవి జీవితంలో ముఖ్యమైన అంశాలు ఈ చిత్రం లో చోటు చేసుకుంటాయని హన్సల్ తెలిపారు. ఈ చిత్రంలో శ్రీదేవి పాత్రలో నటి విద్యాబాలన్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరగుతున్నాయని వెల్లడించారు. శృంగారతార సిల్క్‌స్మిత్ బయోపిక్ ది దర్టీ పిక్చర్ లో విద్యాబాలన్ అద్భుతంగా నటించి జాతీయ అవార్డును గెలుచుకున్నారు. మరి శ్రీదేవి గా ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.