Nayanthara: నయనతార ప్రమోషన్లకు రాకపోవడానికి అదే కారణమా!

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నయనతార ఇప్పటికి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈయన దర్శకుడుగా పలు సినిమాలకు దర్శకత్వం వహించినప్పటికీ ప్రస్తుతం మాత్రం ఈయన వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు. విగ్నేష్ 9స్కిన్ పేరుతో స్కిన్ కేర్ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక ఈ వ్యాపారం లోకి అడుగుపెట్టినటువంటి వీరిద్దరూ తమ వ్యాపారాన్ని విస్తరింప చేయాలని ప్రమోషన్ల నిమిత్తం మలేషియా వెళ్లారు.

అక్కడ ఈ దంపతులు ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా నయనతార ఎందుకు సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటారనే విషయాలను వెల్లడించారు. నయనతార కేవలం ఇతర సినిమాలను మాత్రమే కాకుండా తన సొంత నిర్మాణ సంస్థలో తెరికెక్కిన సినిమాలను కూడా పెద్దగా ప్రమోట్ చేసుకోదు ఇలా ఈమె ఎందుకు సినిమా ప్రమోషన్లకు రాదు అనే విషయం గురించి విగ్నేష్ మాట్లాడుతూ.. నయన్ దేనినైనా మనస్పూర్తిగా నమ్మితే ప్రమోట్ చేయడానికి ముందుకు వస్తారు.

అయితే కొన్నిసార్లు ఈమె తన సొంత సినిమాలను కూడా ప్రమోట్ చేయడానికి ముందుకు రారు. ఇలా సినిమా ప్రమోషన్లకు రాకపోవడానికి మరే కారణం లేదు సినిమాలలో సరైన కంటెంట్ కథలో బలం ఉంటే సినిమాలకు ఎలాంటి ప్రమోషన్స్ అవసరం లేదని నయనతార బలంగా నమ్ముతుంది. అందుకే తాను సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటుందని ఈయన వెల్లడించారు. ఇక మేము 9స్కిన్ బిజినెస్ మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు ఈ ప్రొడక్ట్స్ అన్నింటినీ నయనతార స్వయంగా ఉపయోగించి వాటి ఫలితాలను తెలుసుకున్న తర్వాతే ఈ బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టమని తెలిపారు.

ఇక నేను దర్శకుడిగా నయనతార (Nayanthara) తోనే నా మొదటి సినిమా చేశాను ఆ సమయంలోనే తనలో నాకు ఎంతో నమ్మకం నిజాయితీ కనిపించిందనీ ఈ సందర్భంగా నయనతార గురించి విగ్నేశ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విగ్నేష్ నయనతార గత కొంతకాలంగా ప్రేమలో ఉంటూ గత ఏడాది పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ జంట సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులుగా మారారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus