2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో ఏ విషయం ఎంత హైలైట్ అయ్యిందో తెలియదు కానీ… విజయ్ సైకిల్ మీద పోలింగ్ స్టేషన్‌కి వచ్చిన వీడియో మాత్రం తెగ వైరల్ అయ్యింది. ఇంటి నుండి పోలింగ్ స్టేషన్‌కు విజయ్ సైకిల్ మీద వచ్చి ఓటేసి వెళ్లారు. అలా ఎందుకు చేశాడో అప్పుడు విజయ్ చెప్పలేదు. అయితే మూడేళ్ల తర్వాత ఆ అంశంపై విజయ్ మాట్లాడాడు. ‘బీస్ట్’ సినిమా ప్రచారంలో భాగంగా విజయ్ మాట్లాడుతూ ‘సైకిల్ రైడ్ పోలింగ్’ గురించి వివరించాడు.
2021 ఎన్నికల్లో ఓటు వేయడానికి విజయ్ సైకిల్‌పై వెళ్లడం గురించి అందరూ గురించి కథలు కథలుగా చెప్పుకున్నారు. పోలింగ్ బూత్ వెనుకే విజయ్ ఇల్లు ఉంటుందని అందుకే అలా వచ్చాడని కొందరు అంటే, ఇంకొందరేమో రాజకీయ కోణంలో మాట్లాడారు. అయితే ఆ రోజు ఏం జరిగిందో విజయ్ చెప్పాడు. ఓటు వేయడానికి ఇంట్లో నుండి బయటకు వస్తుండగా విజయ్ కొడుకు జేసన్ సంజయ్… ‘పక్కనే కదా. సైకిల్‌పై వెళ్లు’ అని అన్నాడట.
దీంతో విజయ్ సైకిల్‌పై పోలింగ్ బూత్‌కు వెళ్లాడు. అయితే ఇంతలా రియాక్షన్ ఉంటుందని అనుకోలేదట. అసలు విషయం తెలియక విజయ్ సైకిల్‌పై రావడం చూసి అందరూ వార్తలు రాసేసుకున్నారట. ఈ విషయంలో టీవీల్లో లైవ్ కూడా ఇచ్చారు. అది చూసి జేసన్ సంజయ్ తండ్రికి ఫోన్ చేసి.. ‘నా సైకిల్ బాగానే ఉందా’ అని అడిగాడట. అలా అనేసరికి విజయ్‌కి నవ్వొచ్చిందట. గతంలో నేను సినిమా వార్తలు మాత్రమే చదివేవాడట విజయ్. ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ పైనే ఎక్కువ ఫోకస్ చేసేవాడట.
కానీ, ఇప్పుడు నేను అన్నిరకాల వార్తలు చూస్తున్నాడట. అలాగే చాలామందిలాగే విజయ్ దేవుడ్ని నమ్ముతాడు. అలా హిందువుల గుడికి వెళ్తాడు, చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తాడు, దర్గాకి కూడా వెళ్తాడట. చెన్నైలో ఉన్నప్పుడు దేవాలయాలకు వెళ్లడం కుదరదు కాబట్టి… విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ ఉన్న ప్రధాన ఆలయాలకు వెళ్లి పూజలు, ప్రార్థనలు చేసుకొని వస్తాడట.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!