Vijay, Trisha: 14 ఏళ్ళ తర్వాత జతకడుతున్న విజయ్- త్రిష

కొన్ని కాంబినేషన్లకు సెపరేట్ క్రేజ్ ఉంటుంది. ఆ కాంబోలో కనుక మరో సినిమా వస్తుంది అంటే సహజంగానే ఆ సినిమా పై ఆసక్తి పెరుగుతుంది. ఇప్పుడు ‘తలపతి 67’ పై కూడా ప్రేక్షకుల్లో అలాంటి ఆసక్తినే రేపింది.గతేడాది ‘బీస్ట్’ ఈ ఏడాది ‘వరిసు’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు విజయ్.. ఆ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కొల్లగొట్టాడు. ఇదే జోష్లో మరో బ్లాక్ బస్టర్ కొట్టాలని అతను డిసైడ్ అయ్యాడు.

గతేడాది ‘విక్రమ్’ తో కోలీవుడ్లో ఇండస్ట్రీ హిట్ కొట్టిన దర్శకుడు లోకేష్ కనగరాజన్ తో జతకట్టబోతున్నాడు విజయ్. వీరి కాంబినేషన్లో ఆల్రెడీ ‘మాస్టర్’ అనే సినిమా వచ్చింది. అది యావరేజ్ గానే ఉన్నప్పటికీ భారీ వసూళ్లను కొల్లగొట్టింది. ‘7 స్క్రీన్ స్టూడియో’ బ్యానర్ పై ఎస్.ఎస్ లలిత్ కుమార్ నిర్మించబోతుండగా, జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ చిత్రంలో నటించబోతున్నాడు. అలాగే ‘లీడర్’ హీరోయిన్ ప్రియా ఆనంద్ కూడా ఓ కీలక పాత్రకు ఎంపికయ్యారు.

అర్జున్ సార్జా కూడా ఓ పాత్రకు ఎంపికయ్యాడు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ ప్రాజెక్టులోకి త్రిష కూడా ఎంట్రీ ఇచ్చింది. విజయ్ కు జోడీగా ఆమె ఈ చిత్రంలో నటించబోతోంది.14 ఏళ్ళ తర్వాత ఈ కాంబో రిపీట్ కాబోతోంది. గతంలో ధరణి దర్శకత్వంలో వచ్చిన ‘గిల్లి’ లో వీళ్ళు జంటగా నటించారు.

తెలుగులో సూపర్ హిట్ అయిన ‘ఒక్కడు’ కి రీమేక్ గా గిల్లి తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక 14 ఏళ్ళ తర్వాత విజయ్ – త్రిష … ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. ఇక ‘తలపతి 67’ కి అనిరుధ్ సంగీతం అందించబోతున్నాడు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus