విడుదలకు సిద్దమౌతున్న సైతాన్ చిత్రం..!

‘బిచ్చగాడు’ చిత్రం తో ఇటీవలే విజయాన్ని అందుకున్న విజయ్ ఆంటోని.. ‘సైతాన్’ చిత్రం ద్వారా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రంలో విజయ్ ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి పాత్రలో నటిస్తుండగా.. ప్రతి కృష్ణమూర్తి ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను జూన్ లో విడుదల చేస్తుండగా..

ఈ చిత్రాన్ని జులై లేదా ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. లైకా ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మరోవైపు జీవా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యెమన్ చిత్రంలోనూ విజయ్ నటిస్తున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus