Vijay: ఆ విషయంలో విజయ్ నంబర్ వన్!

  • December 14, 2021 / 07:19 PM IST

తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబుకు ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. ఒక్కో సినిమాకు ఈ ఇద్దరు హీరోలు 50 కోట్ల రూపాయలకు పైగా పారితోషికం తీసుకుంటున్నారు. తెలుగులో ఈ హీరోలకు ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తమిళంలో విజయ్ కు కూడా అదే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రతి సంవత్సరం ట్విట్టర్ ట్వీట్ల ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలిచిన వాళ్లకు సంబంధించిన జాబితాను ప్రకటిస్తుంది.

ఈ సంవత్సరానికి సంబంధించి ఎక్కువగా ట్వీట్ లో నిలిచిన సౌతిండియా స్టార్ మేల్ లిస్ట్ ట్విట్టర్ ఇండియా ద్వారా రిలీజైంది. ఈ జాబితాలో కోలీవుడ్ స్టార్ విజయ్ నంబర్ వన్ స్థానంలో ఉండగా టాలీవుడ్ స్టార్ హీరోలు తర్వాత స్థానాలలో ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉండగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు. కోలీవుడ్ హీరో సూర్య ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉండగా తారక్ ఐదో స్థానంలో ఉన్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఏడో స్థానంలో నిలవగా ఎనిమిదో స్థానంలో రామ్ చరణ్ తొమ్మిదో స్థానంలో ధనుష్, పదో స్థానంలో అజిత్ కుమార్ నిలిచారు. టాలీవుడ్ టాప్ హీరోలను దాటి కోలీవుడ్ హీరో టాప్ లో నిలవడం గమనార్హం. విజయ్ అరుదైన రికార్డును సొంతం చేసుకోవడంతో ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు. సినిమాసినిమాకు విజయ్ కు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.

ఫిమేల్ జాబితాను పరిశీలిస్తే ఈ జాబితాలో కీర్తి సురేష్ ముందువరసలో ఉండగా పూజా హెగ్డే రెండో స్థానంలో సమంత మూడో స్థానంలో ఉన్నారు. గతేడాది ప్రకటించిన జాబితాలో మహేష్ బాబు ఫస్ట్ ప్లేస్ లో ఉండగా పవన్ కళ్యాణ్, విజయ్ తర్వాత స్థానాలలో ఉన్నారు. అయితే ఈ ఏడాది మాత్రం విజయ్ టాలీవుడ్ హీరోలకు షాక్ ఇచ్చారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus