వైరల్ కామెంట్స్‌తో సినిమాకు తద్వారా తనకూ ప్రచారం దక్కించుకోవడంలో విజయ్ దేవరకొండ సిద్ధహస్తుడు అని చెప్పాలి. గతంలో తన సినిమాల విడుదల సమయంలో ఇలాంటి ఫీట్లు చాలానే చేశాడు. తాజాగా ‘లైగర్’ ట్రైలర్ రిలీజ్ వేడుకలో కూడా ఇలాంటి పనే చేశాడు. స్టేజీ ఎక్కడం ఎక్కడం ‘‘నాకు ఏమీ అర్థం కావడం లేదు. మీకు మా అయ్య తెల్వదు, మా తాత తెల్వదు, ఎవ్వడూ తెల్వదు. నా సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు అయితుంది.
అయినా ట్రైలర్‌కి ఈ రచ్చ ఏందిరా నాయన’’ అంటూ కామెంట్లు చేశాడు. మామూలుగా ఇది మాస్ డైలాగ్ కానీ.. ఇందులో వారసత్వం మీద కామెంట్స్ చేసినట్లే అంటున్నారు నెటిజన్లు. టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోలు చాలావరకు నెపోటిజం మాటలు పడుతున్నవాళ్లే తాత, తండ్రి పేరు చెప్పుకుని హీరోలుగా రాణిస్తున్నారు అని కామెంట్స్ వినిపిస్తుంటాయి. దీనిపై విజయ్ దేరవకొండ ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ చేయడం గమనార్హం. తనకు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా, తన బ్యాగ్రౌండ్ తెలియకపోయినా ఫ్యాన్స్ ఆదరిస్తున్నారు అని అన్నాడని కొందరు అంటుంటే..
లేదు లేదు నెపోటిజం కామెంట్స్ అవి అని ఇంకొందరు అంటున్నారు. అయితే వారసత్వం మీద కామెంట్స్ చేసే ముందు విజయ్ ఇంట్లోనే వారసత్వం అనే కాన్సెప్ట్ ఉందనే విషయం మరచిపోకూడదు అని గుర్తు చేస్తున్నారు. విజయ్ తండ్రికి ఇండస్ట్రీతో సంబంధం ఉంది. ఆయన తండ్రి దర్శకత్వ శాఖలో పని చేశారు. ఆ విషయం పక్కన పెడితే తన తమ్ముడు ఆనంద్ దేవరకొండను వారసత్వంతోనే విజయ్ తీసుకొచ్చాడు అనేది మరచిపోకూడదు అని అంటున్నారు నెటిజన్లు.
మరి ఇంట్లోనే వారసత్వం హీరో పెట్టుకుని అలా తాత, తండ్రి కామెంట్లు ఎందుకు అనేది విజయ్‌కే తెలియాలి. మామూలుగా అయితే విజయ్ ఇలాంటి కామెంట్లు చేసేది అటెన్షన్ కోసమే అని అంటుంటారు. ఇప్పుడు ‘లైగర్’ విషయంలోనూ ఇదే చేశారా అనేది ఆయనకే తెలియాలి. అన్నట్లు ‘లైగర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను భారీగా కాకుండా అలా ఓ థియేటర్‌లో సర్దేశారు ఎందుకో?
Most Recommended Video
రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!