“నువ్వు పరీక్షల్లో పాసవుతావా లేదా ఫెయిల్ అవుతావా అనే విషయం పక్కన పెడితే.. ఎంత నిక్కచ్చిగా ప్రయత్నించావు అనేది చాలా ఇంపార్టెంట్” అని మన పెద్దలు పిల్లలకు చెబుతుంటారు. ఇదే సూత్రం సినిమాలకు కూడా వర్తిస్తుంది. నీ సినిమాలో కంటెంట్ ఎంతుంది? అనే విషయం పక్కన పెడితే.. ఆ సినిమా ఆడుతున్న థియేటర్లకు జనాలని తీసుకురాగలిగావా లేదా అనేది ముఖ్యం. ఇప్పుడున్న హీరోలు సినిమాలో నటిస్తే మాత్రమే సరిపోదు.. అగ్రెసివ్ ప్రమోషన్స్ తో జానాల్ని థియేటర్ల వరకూ తీసుకురావాలి కూడా. అలాగని విడుదలకు ముందు ప్రమోషన్స్ జోరుగా చేసేసి.. విడుదలయ్యాక వదిలేయడం కాదు. కనీసం రెండు వారాల వరకైనా సినిమాలను ప్రమోట్ చేయాలి.
అందుకే.. చాలా యావరేజ్ టాక్ తెచ్చుకొన్నప్పటికీ.. ఛార్మీ, పూరీ జగన్నాధ్, రామ్, నిధి, నభాలు చేసిన అగ్రెసివ్ ప్రమోషన్స్ కారణంగా “ఇస్మార్ట్ శంకర్” ఇంకా థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఆడుతుండగా.. “డియర్ కామ్రేడ్” మాత్రం ప్రొడ్యూసర్స్ కి పెద్ద తలబరువుగా మారింది. విడుదలకు ముందు సినిమా ప్రమోషన్స్ తో తెగ హడావుడి చేసిన విజయ్ దేవరకొండ.. విడుదలైన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ తర్వాత లైట్ తీసుకొన్నాడు. “ఇస్మార్ట్ శంకర్” టీం లా డైరెక్ట్ థియేటర్ విజిట్స్ కాకపోయినా.. కనీసం సోషల్ మీడియాలో కనీస స్థాయిలో ప్రమోట్ చేసినా కలెక్షన్స్ కాస్త బెటర్ గా ఉండేవి అని విశ్లేషకుల అంచనాలు. సో, విజయ్ దేవరకొండ తన పరాభవాన్ని మరీ తొందరగా అంగీకరించడం వలన నిర్మాతలు భారీ స్థాయిలో నష్టపోయారు. “డియర్ కామ్రేడ్” విషయంలో చేసిన తప్పు విజయ్ తన భవిష్యత్ సినిమాల విషయంలో చేయకుండా ఉంటే బెటర్.