విజయ్ దేవరకొండ – సమంత – శివ నిర్వాణ సినిమా గురువారం ప్రారంభమైన విషయం మీకు తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న ఈ చిత్రం ముహూర్త కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ ట్విటర్‌లో కొన్ని ఫొటలను షేర్ చేసింది. వాటి ప్రకారం చూస్తే అయితే ఈ వేడుకకు సమంత హాజరు కాలేదు. ఆమెతోపాటు మరో ఇద్దరు ప్రముఖ హాస్య నటులు కూడా రాలేదు. అయితే సాయంత్రానికి విజయ్ దేవరకొండ రెండు ఫొటోలు రిలీజ్ చేశాడు.
అందులో మాత్రం ఉన్నారు. అంతేకాదు ‘మీడియా ఈ ఫొటోనే వాడుకోండి’ అంటూ సూచన కూడా చేశాడు విజయ్. అప్పుడు లేని వాళ్లు ఇప్పుడు ఎలా వచ్చారు అనే డౌట్ మీకు కూడా రావొచ్చు. పొటో షాప్ చేస్తే వస్తారు అని మేం ఈజీగా చెప్పేయొచ్చు. నిజానికి జరిగిందీ ఇదే. అందులో ఏముంది విజయ్ ఏదో సరదాకి చేసుంటాడులే అని అంటారా? ఆయన చేసింది సరదాగాకే అనే విషయం అందరికీ తెలిసిందే.
అయితే దాన్ని ఫ్యాన్స్ వరకు, నెటిజన్ల వరకు వదలేసి ఉంటే సరదాలాగే ఉండేది. మీడియా కూడా ఈ ఫొటోనే వాడండి అంటూ సూచించడమే ఇక్కడ విషయం. కొన్ని మీడియా సంస్థల మీద విజయ్ అప్పుడప్పుడు శివాలెత్తుతుంటాడు. అలాగే మిగిలిన హీరోలు కూడా ఈ విషయాన్ని రెయిజ్ చేసినప్పుడు సపోర్టు చేస్తుంటాడు. తన గురించి లేని పోని విషయాలను వార్తలుగా రాస్తున్నారని ఆయన కోపం. చేయనవి చేసినట్లు చెబుతున్నారని, వార్తలు మాత్రం రాయండని సలహా కూడా ఇస్తుంటాడు విజయ్ దేవరకొండ.
మరి అంత వార్తల వాటి ప్రభావం మీద అవగాహన ఉన్నవాడు… లేనిది, జరగనిది షేర్ చేసి ఎందుకు మీడియాకు సూచనలు చేయడం అనేదే ఇక్కడ ప్రశ్న. మీరు మళ్లీ ఏదో సరదాకి చేసుంటాడులెండి విజయ్ దేవరకొండ అనే మాట అనొచ్చు. దీని కోసం ఇంత అనాలా అనుకోవచ్చు. ఆయన సరదాలు ఆయన వరకు చూసుకుంటే ఓకే, లేదంటే ఫ్యాన్స్ వరకు ఓకే. మీడియా కూడా వీటినే ఫాలో అవ్వండి అంటే ఎలా. మీకు కూడా ఇప్పుడు అదే అనిపిస్తోంది కదా. ఏదైతే ఏముంది విజయ్ ఫొటోషాప్ ఎడిటింగ్ వర్క్ అయితే సూపర్.