Vijay Devarakonda, Rashmika: రష్మిక కోసం నేను ఎదురు చూస్తున్నాను… విజయ్ కామెంట్స్ వైరల్!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవడంతో చెన్నైలో సైతం భారీగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగా విజయ్ దేవరకొండ కోయంబత్తూర్ లో ఒక కాలేజీ స్టూడెంట్స్ తో ఈయన ఇంటరాక్ట్ అవుతూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

ఈ సందర్భంగా ఒక స్టూడెంట్ (Vijay Devarakonda) విజయ్ దేవరకొండని ప్రశ్నిస్తూ మీరు తిరిగి రష్మిక మందన్నతో ఎప్పుడు సినిమా చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు. దీంతో విజయ్ దేవరకొండ సమాధానం చెబుతూ మీ దగ్గర మంచి స్క్రిప్ట్ ఉంటే చెప్పండి ఇప్పుడే తనతో కలిసి సినిమా చేస్తాను అంటూ సమాధానం చెప్పారు. నేను కూడా ఒక మంచి కథ కోసం ఎదురు చూస్తున్నానని,మంచి కథ దొరికితే రష్మికను తన సినిమాలలో ఎంపిక చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఈయన తెలియజేశారు.

ఈ విధంగా రష్మికతో మరోసారి సినిమా చేయడానికి తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ చెప్పకనే చెప్పేశారు. అయితే ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన డియర్ కామ్రేడ్,గీత గోవిందం సినిమాలలో వీరిద్దరి కెమిస్ట్రీ మంచిగా వర్కౌట్ కావడంతో మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావాలని అభిమానులు కూడా ఆకాంక్షిస్తున్నారు అయితే ఈ రెండు సినిమాలలో నటించడంతో వీరి గురించి ఎన్నో రకాల వార్తల వైరల్ అవుతున్నాయి.

ఈ రెండు సినిమాలలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా ఉండటంతో నిజంగానే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అంటూ ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలు గురించి వీరిద్దరూ ఖండించిన రష్మిక విజయ్ దేవరకొండ రిలేషన్ లో ఉన్నారనే వార్తలు ఏమాత్రం ఆగడం లేదనిచెప్పాలి. అయితే రష్మికతో సినిమా చేయడం కోసం తాను ఎదురు చూస్తున్నాను అంటూ మరోసారి ఈయన కామెంట్ చేయడంతో వీరిద్దరి గురించి వస్తున్నటువంటి వార్తలకు మరింత బలం చేకూరింది.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus