Vijay, Puri: పూరి సినిమాలో మిలిటరీ రూల్..!

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో ‘లైగర్’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. ఇందులో అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకుండానే పూర్తి-విజయ్ కలిసి మరో సినిమాకి పని చేయడం మొదలుపెట్టారు. అదే ‘జనగణమన’. ఈ సినిమాలో విజయ్ సైనికుడిగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

సాధారణంగా సైనికుల కాన్సెప్ట్ తో సినిమా అంటే బోర్డర్ లో ఫైట్, యుద్ధాలు ఇవే ఉంటాయని అనుకుంటాం. కానీ దర్శకుడు పూరి జగన్నాధ్ ఈసారి డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారట. ఈ సినిమాలో సమకాలీన రాజకీయాలకు పెద్ద పీట వేశారట పూరి. ఈ దేశంలో మిలిటరీ రూల్ వస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ పై సినిమా నడవబోతుందని తెలుస్తోంది. దేశంలోని రాజకీయ వ్యవస్థ పూర్తిగా బ్రష్టు పట్టుకొనిపోయినప్పుడు మిలిటరీ ఎలా స్పందించాలి..?

ఈ దేశ పాలనా వ్యవస్థను చేతుల్లోకి తీసుకొని పరిపాలిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి ఈ కథ పుట్టుకొచ్చిందట. అంటే ఈ దేశాధినేతగా విజయ్ ని చూడబోతున్నామన్నమాట. ఇదివరకు ఆయన ‘నోటా’ అనే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా చేశారు. ఆ సినిమా పెద్దగా వర్కవుట్ కాలేదు. మరి ఈ సినిమా పూరి ఏం చేస్తాడో చూడాలి.

గతంలో ఈ సినిమా కథను చాలా మందికి చెప్పారు పూరి. అందులో మహేష్ బాబు కూడా ఉన్నారు. మహేష్ హీరోగా సినిమా పోస్టర్ కూడా వచ్చింది. కానీ కొన్ని కారణాల వలన మహేష్ ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశారు. ఇది పూరి జగన్నాధ్ డ్రీమ్ ప్రాజెక్ట్. మహేష్ తో కుదరకపోవడంతో ఇప్పుడు విజయ్ తో తీయడానికి రెడీ అవుతున్నారు. ఇందులో పూజాహెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus